Home / Inspiring Stories / సూప్రీం కోర్ట్ కి బెదిరింపు ?

సూప్రీం కోర్ట్ కి బెదిరింపు ?

Author:

1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో యాకూబ్ మెమన్ కు ఉరిశిక్ష ఖరారు చేసిన సూప్రీం కోర్ట్ న్యాయమూర్తుల్లో ఒకరైన జస్టిస్ దీపక్ మిశ్రాకు ఈ నెలారంభంలో బెదిరింపు లేఖ వచ్చిన సంగతి తెలిసిందే. ముష్కరులు మరో అడుగు ముందుకు వేసి సూప్రీం కోర్ట్ లో బాంబులు పెట్టి పేల్చేస్తామని గుర్తు తెలియని నిందితులు బెదిరింపు లేఖ పంపించారు. గుర్తు తెలియని ఒక ఈ -మెయిల్ ఐడి నుండి బెదిరింపు లేఖ వచ్చిందని పోలీసు అధికారులు అంటున్నారు.మంగళవారం సుప్రీం కోర్టు లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సుప్రీం కోర్టు లోకి వెలుతున్న వారిని క్షుణ్ణంగా పరిశీలించి లోపలికి పంపిస్తున్నారు. న్యాయమూర్తులను మినహాయించి ప్రతి ఒక్క న్యాయవాదిని, సూప్రీం కోర్ట్ సిబ్బందిని పరిశీలించి లోపలికి పంపిస్తున్నారు. ఈ-మెయిల్ ఎక్కడి నుండి వచ్చింది అని పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు.భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు పేల్చివేస్తామంటూ బెదిరింపు మెయిల్‌ వచ్చిందంటే ముష్కరులు ఎంతకు తెగించారో అర్థం అయిపోతుంది. ఇక 1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో ఉరి శిక్షకు గురైన యాకూబ్ మెమెన్ కేసులో తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి దీపక్ మిశ్రాను అంతం చేస్తామని ఆగస్టు 7వ తేదిన బెదిరింపు లేఖ పంపించారు. ఇదే సమయంలో సుప్రీం కోర్టుకు బాంబు బెదిరింపు లేఖ రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. సూప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి హెచ్.ఎల్. దత్తు నిందితుడు యాకూబ్ మెమెన్ కేసు తీర్పు వెల్లడించాడనికి త్రిసభ్య బెంచ్ ఏర్పాటు చేశారు. ఆ త్రిసభ్య బెంచ్ లో జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ప్రఫుల్లా సి. పంత్, జస్టిస్ అమితావ్ రాయ్ ఉన్నారు. ఈ ముగ్గురు న్యాయమూర్తులు అర్దరాత్రి సుప్రీం కోర్టులో యాకూబ్ మెమెన్ అర్జీ విచారణ చేశారు. యాకూబ్ మెమెన్ క్షమాభిక్ష అర్జీని తిరస్కరించి ఉరి శిక్ష అమలు చెయ్యాలని తీర్పు ఇచ్చారు. ఇలాంటి బెదిరింపులకు తెగించిన వారు ముందు ముందు ఏమైనా చేయగలరని న్యాయమూర్తులకు అదనపు భద్రతను కల్పించారు. ఇటీవల కాలంలో తరచూ వస్తున్న ఇలాంటి బెదిరింపులకు చరం గీతం పాదాలని యావత్ దేషం కోరుకుంటొంది. ప్రషాంత్నగా జీవంచగలిగే అవకాసం కల్పిస్తున్న భారత్ లో ఇలాంటి దుశ్చర్యలు జరగడం నిజంగా శోచనీయం అని మేధావులు విచారం వ్యక్తం చెశ్తున్నారు.

(Visited 74 times, 1 visits today)