Home / health / మీ బొటన వేలుని చూసి, మీరు ఎటువంటి వారో తెలుసుకోవచ్చు.

మీ బొటన వేలుని చూసి, మీరు ఎటువంటి వారో తెలుసుకోవచ్చు.

Author:

మన పూర్వికులు మనకు ఎన్నో విషయాలుచెప్పారు. అందులో చాలా వరకు విషయాలు మనకు చాలా విధాలుగా ఉపయోగపడనున్నాయి. మన పూర్వికులు ఏ విషయం మనకు చెప్పిన అవి వారి అనుభవంలోంచి వచ్చినవి అయి ఉంటాయి అని ఖచ్చితంగా చెప్పవచ్చు.ఇలాంటి విషయాలలో జాతకం కూడా ఒకటి. ఇందులో అనేక రకాలుగా ఉంటాయి. కొందరు చేయి చూసి చెపుతారు. కొందరు పుట్టిన నక్షత్రం బట్టి చెపుతారు.. ఇలా చాలా రకాలుగా చెపుతుంటారు. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే చేతివేళ్ళని బట్టి కూడా మన వ్యక్తిత్వాన్ని చెప్పవచ్చు మన పూర్వికులు ఎప్పుడో చెప్పారు. ఆ విషయాన్ని ఇప్పుడు కొంతమంది పరిశోధన చేసి నిరూపించారు.

మీ బొటన వేలు ఛాలెంజ్ చేసే సమయంలో ఏవిధంగా ఉంటుందో ఒకేసారి చూసుకొండి. ఎందుకంటే కొందరిది నిటారుగా ఉంటుంది, మరికొందరిది కొద్దిగా  వంగి ఉంటుంది. దీన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలిసిపోతుంది.

mb-finger-shape-tells-about-our-character

బొటనవేలు కొద్దిగా గా వంగి ఉంటే మీ ఆలోచనలను ఇతరులకు వ్యక్తపరుచడంలో ఎలాంటి ఇబ్బంది పడరు. అలాగే మంచి చమత్కారులు. మీ యొక్క సాంగత్యాన్ని ఇతరులు ఎక్కువగా కోరుకుంటారు. మీరు ఇతరులను చాలా గుడ్డిగా నమ్ముతారు. మిమ్మల్ని మీరు ఎప్పుడు కొత్తగా ఆవిష్కరించుకోవడంలో ఎప్పుడు ముందు ఉంటారు. మీ మెదడు ఎప్పుడు చురుగ్గా పని చేస్తుంది.

మీ బొటన వేలు నిటారుగా ఉంటే మీరు ముక్కుసూటిగా మాట్లాడే స్వభావం కలవారు, ఎవరికీ ఎక్కువగా చనువు ఇవ్వరు, ఎదుటివారు ఎంత వారైనా వారిని మీరు సులభంగా అంచనా వేయగలరు. చెడువారికి ఎప్పుడు దూరంగా ఉంటారు. అనవసరమైన విషయాలలో తలదూర్చే మనస్తత్వం కాదు మీది, మీరు చాలా కోపిష్టి గా ఉంటారు, మీ లిమిట్స్ మీకు బాగా తెలుసు.

దీనిని కొన్ని పరిశోధనలని ఆధారంగా చేసుకొని చెప్పారు,ఈ విషయాన్ని నమ్మటం నమ్మకపోవటం అన్నది మీరు చెక్ చేసుకోవటాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది… మరి ఓ సారి ట్రై చేసి చూడండి.

Must Read: మీరు పుట్టిన నెలను బట్టి మీ మనస్తత్వం ఎలాంటిదో తెలుసుకోవచ్చు…!

(Visited 6,643 times, 1 visits today)