Home / Inspiring Stories / ధూమపానం చేస్తున్నారా! అయితే ఈ చిట్కాలతో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

ధూమపానం చేస్తున్నారా! అయితే ఈ చిట్కాలతో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

Author:

Stop-Smoking

ధూమపానం ఇప్పుడు భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న ఒక వ్యసనం. ఒక వ్యక్తి ఒక్క సిగరెట్ తాగడం వలన తన ఆయుర్దాయంలో 11 గంటలను కోల్పోతాడు. ధూమపానం అనేది ముందు సరదాగా మొదలై ఆ తర్వాత వ్యసనంగా మారుతుంది. ధూమపానం చేసేవారికన్న వారి పక్కన ఉన్న వారికే ఎక్కువ ప్రమాదం, అందుకే ప్రభుత్వాలు బహిరంగ ప్రదేశాలలో ధూమపానాన్ని నిషేదించారు. ధూమపానం వలన గుండెజబ్బులు, టిబి, బిపి, షుగర్‌, క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధుల ఎక్కువగా వచ్చే ఆవకాశం ఉంది. అందుకే ధూమపానానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ధూమపానం ఆలవాటు అనేది ఒక్కసారిగా తగ్గించలేరు కాబట్టి కొద్ది కొద్దిగా ధూమపానం తగ్గించడం ఉత్తమమం. ధూమపానం వలన యుక్త వయస్సులో కూడా ముఖంపై ముడుతలు వస్తు ముసలి వ్యక్తులుగా కనిపిస్తారు. ఈ ధూమపానం ఒక్క పురుషులు మాత్రమే చేయడం లేదు స్త్రీలు కూడా చేస్తున్నారు. ధూమపానం చేయడం వలన పుట్టబోయే బిడ్డకు చాలా వ్యాదులు వచ్చే ఆవకాశం ఉంది. ధూమపానం వలన ఎక్కువగా ఊపిరితిత్తులు ముందుగా చెడిపోతాయి, శుభ్రమైన ఆహారపు ఆలవాట్లను చేసుకుని ఊపిరితిత్తులను శుభ్రంగా ఉంచుకుంటే కొన్ని రోజులు మరణాన్ని అడ్డుకోవచ్చు. ఎలాంటి ఆహారాన్ని ఆలవాటు చేస్కోవాలంటే ఎక్కువగా పండ్లు తీసుకోవాలి. వాటిలో ముఖ్యంగా

ద్రాక్షపండు: ద్రాక్షపండు ఎక్కువగా తీసుకోవడం వలన క్యాన్సర్‌, గుండెజబ్బుల నుండి కొద్దిగా తప్పించుకోవచ్చు. ద్రాక్షపండు బాధా నివారక లవణాలు గల ఆమ్లం కూడా ఒక శక్తివంతమైన క్రిమినాశక పనిచేస్తుంది. అదనంగా, ద్రాక్షపండు సీడ్ పదార్దాలు బాక్టీరియల్ మరియు ఫంగల్ అంటువ్యాధులు రాకుండ చేస్తాయి.

అల్లం: అల్లం ఎక్కువగా తీసుకోవడం వలన నోటి దుర్వాసనను పోగోడుతుంది. అల్లం ప్రభావం కాలేయం మీద ఉంటుంది. కొలెస్టరాల్ నియంత్రణలో మెరుగైన పాత్ర వహించేలా కాలేయాన్ని తయారు చేయడమే అల్లం నిర్వహించే పాత్ర. రక్త నాళాల్లో రక్తప్రవాహం మెరుగుపరుస్తుంది. అల్లం మంచి యాంటీ బయోటిక్.

healthy drinks

పైనాపిల్ జ్యూస్: పైనాపిల్‌లో ‘సి’ విటమిన్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది మధుమేహం, హృదయసంబంధ వ్యాధులు, క్యాన్సర్‌ కారకాలైన ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది.

హెర్బల్ టీ: మూసుకుపోయిన రక్తనాళాలను వ్యాకోచం చెందేలా చేసేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. హెర్బల్ టీ త్రాగడంవలన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుతుంది. గుండెపోటునుకూడా నిరోధిస్తుందంటున్నారు.

క్యారట్ జ్యూస్: వీటిలోని బెటా-కెరొటోన్ మన శరీరానికి ‘విటమిన్-ఎ’ను పుష్కలంగా అందిస్తుంది. దీనివల్ల రోగ నిరోధక శక్తి గణనీయంగా వృద్ధి చెందుతుంది.

(Visited 2,374 times, 1 visits today)