Home / Inspiring Stories / మీ ఒంటి మీద నగలు ఎప్పుడూ తళతళా మెరవాలంటే ఇలా చేయండి.

మీ ఒంటి మీద నగలు ఎప్పుడూ తళతళా మెరవాలంటే ఇలా చేయండి.

Author:

బంగారం.. ఈ మాట వింటేనే మన దేశం లో చాలా మంది మహిళలకు ఊపొస్తుంది. మన వాళ్ళు బారసాల దగ్గర్నుంచి పెళ్లి దాకా, ఎలాంటి శుభ కార్యక్రమైన బంగారం కొనకుండా ఉండరు. ఆడయినా, మగయినా.. డబ్బున్నోడి తాహతుకు దగ్గట్టు కొందరు ఒళ్ళంతా బంగారం తో నింపేసుకుంటే, కొందరు కార్లు, పళ్లెం, గ్లాసులతో సహా బంగారం మాయం చేసుకుని తృప్తి పొందుతారు. అయితే ఈ బంగారు ఆభరణాలు కొనుక్కోవడమే కాదు వాటిని కాపాడుకోవడం కూడా ఒక ఆర్టు. ఎక్కువ రోజులు ధరిస్తే బంగారం దాని రంగు మారి మెరుగు తగ్గుతుంది.ఎప్పుడూ తళతళలూ,ధగధగలతో మెరిసిపోయే నగల రంగు, మెరుపు తగ్గితే మనసు చివుక్కుమంటుంది. అయితే ఆ కంగారు ఇంకా మీకక్కర్లేదు. కొన్నిసింపుల్ చిట్కాలతో మీ బంగారానికి మీరే మెరుగు దిద్దుకోవచ్చు . కొంచం ఓపిగ్గా ఈ చిట్కాలు ఎప్పటికప్పుడు పాటిస్తే మీ బంగారం ఎప్పుడు కొత్తగా తళతళలాడుతుంది అంటున్నారు బంగారు ఆభరణాల నిపుణులు. శ్రీ రాం జివెలరీ కి చెందిన అనిత, జైపూర్ జివెలరీ కి చెందిన సుభాష్ లు మన నగలు, బంగారు ఆభరణాలని ఎలా కాపాడుకోవాలో, ఎప్పుడూ కొత్తగా నిగనిగలాడాలంటే ఎం చేయాలో కొన్ని చిట్కాల రూపంలో సూచించారు. అవి మీకోసం ప్రత్యేకం…

tips for gold shining

1) స్నానం చేసేప్పుడు, స్విమ్మింగ్ కి వెళ్ళినప్పుడు బంగారం తీసేయడం లేదా పక్కన పెట్టడం మంచిది. స్నానం చేసేటప్పుడు సబ్బు లో ఉండే రసాయనాల ప్రభావం బంగారం పై పడి మెరుగు పోతుంది.

2) బంగారాన్ని వేరే నగలతో జత చేసి ఎప్పుడూ పెట్టకూడదు. ఇలా వేరే నగలతో పెడితే గనక ఆ రెండు రకాల మెటల్స్ మధ్య రియాక్షన్ జరిగి బంగారం చెడిపోతుంది. సో బంగారాన్ని ఎప్పుడు సెపెరేట్ గా ఒక బాక్స్ లో గాని మఖమల్ క్లాత్ లో గాని, పేపర్ లో గాని కవర్ చేసి పెట్టాలి. ఇలా చేస్తే ఎప్పుడు మీ బంగారం నిగనిగలాడుతోంది.

3) పాలిషింగ్ గాని బఫింగ్ గాని రెగ్యులర్ గా చేయడం వల్ల కూడా బంగారం ఎప్పుడు మెరుస్తూ కొత్తగా ఉంటుంది.

4) కొన్ని సబ్బు నీళ్లలో చిన్న గుడ్డ ని తడిపి బంగారు ఆభరణాలను తుడిస్తే కూడా వాటి షైన్ పెరుగుతుంది. చిన్న బ్రిసల్స్ ఉన్న టూత్ బ్రష్ తో కూడా నగల మధ్య పేర్కొన్న దుమ్ముని క్లీన్ చేయచ్చు.

5) ఇక రాళ్లు, కెంపులు, పచ్చలు , డైమెండ్స్ ఉన్న నగలు మాత్రం నీళ్లలో నానపెట్టకూడదు. సాఫ్ట్ వస్త్రం తో మాత్రమే వాటి ని క్లీన్ చేయాలి.

6) బంగారు ఆభరణాలు కొంచెం నల్లగా మారినట్టు కనిపిస్థే కొంచెం గుమ్మడి రసం తీసుకుని వాటిని తోమితే తళతళ మెరుస్తాయి.

(Visited 1,434 times, 1 visits today)