Home / Entertainment / హ్యాపీ బర్త్ డే రామ్.

హ్యాపీ బర్త్ డే రామ్.

Author:

పోతినేని.రామ్ ఆ పేరు చెబితేనే తన ఫాన్స్ నరనరాల్లో పారే ఒక ఎనర్జీ , వెండి తెరో ,బుల్లి తెరో ఈ హీరో కనిపిచాడంటే ఇక అమ్మాయల గుండెల్లో కాలర్ ట్యూన్ లే. తన నటనతో,ఎనర్జీతో,గ్లామర్ తో తన అభిమానులని అలా ట్యూన్ చేసుకున్నాడు. మన పక్కింటి అబ్బాయి లానే ఉండే ఈ హీరో డాన్స్ కూడా ఇరగదీస్తాడు.

ram-pothineni-

రామ్ 1988 మే 15 న పోతినేని.పద్మ శ్రీ , మురళీమోహన్ దంపతులకు హైదరాబాద్ లో జన్మించారు, రామ్ వాళ్ళ పెదనాన్న స్రవంతి రవికిశోర్, తన పెదనాన్నకి సొంత బ్యానర్,ఇండస్ట్రీలో మంచి సంబంధాలు ఉండటంతో రామ్ తెరారంగ్రేటం పెద్ద కష్టం ఏమీ లేకుండానే జరిగిపోయింది. సాధారణంగా ఇలా ప్రొడ్యూసర్ల అల్లుళ్ళు, డిస్టిబ్యూటర్ల కొడుకులు ఇండస్ట్రీలో గాలి వాటంగా, పాసింగ్ క్లౌడ్ గా మిగిలిపోతారు .కానీ రామ్ విషయం ఉన్న కుర్రోడండీ మొదటి సినిమాతోనే రికార్డులు బద్దలు కొట్టి టోటల్ ఇండస్ట్రీ మొత్తాన్నీ తన వైపు తిప్పుకున్నాడు, పదేళ్ళు దిగ్విజయంగా సినీ కెరీర్ దాటుకుని పదకొండవ ఏట అడుగుపెట్టబోతున్నాడు.

ram-pothineni-

2006లో వైవీయస్ చౌదరి దర్శకత్వంలో దేవదాస్ సినిమా తో రామ్, ఇలియానా తొలిసారి ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమానే ఊహించిన దానికి రెట్టింపు రెస్పాన్స్. ఏకంగా 17 కేంద్రాల్లో 175 రోజులు పూర్తీ చేసుకుని అప్పట్లో ఉన్న పెద్ద పెద్ద హీరోలనే 18 ఏళ్ల వయసులోనే అబ్బురపరిచాడు రామ్.ఆ తర్వాత జగడం అంటూ సుకుమార్ తో ఓ మోస్తరు సినిమాతో వచ్చినా, వెంటనే మొదటి సినిమా ఏమీ గాలివాటం కాదంటూ తనలోని పసని, కామెడీ టైమింగ్ నీ చూపిస్తూ శ్రీను వైట్ల తో కలిసి “రెడీ ” అంటూ మరో హిట్టు కొట్టాడు . ఆ తర్వాత ఒకటి అరా ఫైల్యూర్ సినిమాలు ఇచ్చిన రామ్ ఇక తన క్రేజ్ పడిపోతుందేమో అనుకునే లోగానే “కందిరీగ ” అంటూ మరో హిట్ సినిమా ఇచ్చాడు .

వెంటనే “ఎందుకంటే ప్రేమంట”, “ఒంగోలు గిత్త ” అని ఆ వెంటనే విక్టరీ .వెంకటేష్ తో కలిసి “మసాలా” వరసగా సినిమాలు చేసి అలరిచిన రామ్ ,ఆ తర్వాత పండగ చేసుకో అనే సాటిస్ఫైడ్ సినిమాని , శివం అనే ఫ్లాప్ సినిమానీ ఇచ్చాడు. మళ్ళీ కెరీర్ కాస్త గాడితప్పుతుంది అనుకుంటున్న టైం లో “నేనూ శైలజ ” అనే సూపర్ హిట్ సినిమాతో వచ్చాడు .

ram-pothineni-

ఇలా అభిమానులనే కాక సగటు సినిమా వ్యూవర్స్ ని కూడా ఆకట్టుకుంటూ, రామ్ ఈ రోజు న ఇండస్ట్రీ కి వచ్చాక తన 10 వ పుట్టినరోజుని మొత్తం గా తన 28 వ పుట్టిన రోజునీ సెలబ్రేట్ చేసుకోబోతున్నారు . ఈ ఎనర్జిటిక్ యంగ్ స్టార్ కెరీర్ లో మరిన్ని మైలు రాళ్ళు దాటుకొని ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేయాలని కోరుకుంటూ, హ్యాపీ బర్త్ డే చెప్పేద్దామా మరి . హ్యాపీ బర్త్ డే రామ్.

(Visited 353 times, 1 visits today)