Home / Inspiring Stories / దివ్యాత్మని మోసిన దేహమొకటి ఈ దేశపు నేలపై నడిచిందని తెలుసా…?

దివ్యాత్మని మోసిన దేహమొకటి ఈ దేశపు నేలపై నడిచిందని తెలుసా…?

Author:

Swami Vivekanada

దివ్యాత్మని మోసిన దేహమొకటి ఈ దేశపు నేలపై నడిచిందని తెలుసా…?, “స్వామి వివేకానంద” గా ఈ నేలపై నడిచేందుకు ఒక దేహాన్నెంచుకున్నదేమో.భారతీయ హిదూత్వ భావజాలాన్ని ప్రపంచ వ్యాపితం చేసేందుకు ఒక వెలుగురేక ఇక్కడికి నడిచివచ్చి కాలాన్నీ,ప్రజలనీ ఆత్మ విజయం దిశగా నడిపించి… ధ్యాన మార్గన్ని నిర్మించి మళ్ళీ వెళ్ళిపోయింది. వివేకానందుడుగా మారిన నరేంద్రుడు ఒక దేహమైతే ఆ దేహం మోసుకుటూ తిరిగిన ఆత్మే స్వామీ వివేకానంద…. ఆధ్యాత్మికమంటే అందరినీ వదిలేసి ఒంటరిగా వెళ్ళటం కాదు సమాజాన్ని నిర్మించే ప్రయత్నమే తపస్సు అన్న మాటని వినిపించేందుకు వచ్చిన ఆ నిరాకార స్వరూప వాణి ఈ వివేకానంద… వచ్చాడు… నడిచాడు… తానే ఒక మార్గమై వెళ్ళిపోయాడు….

ramakrishnavivekananda

అద్వైత వేదాంతం ఒక విశ్వరహస్య శొదనా మార్గం ధ్యానంలోనే మనిషి పరిపూర్ణుడవుతాడు. అతను సమాజాన్ని నిర్మించాలే తప్ప మొక్షమూ, స్వర్గమూ అంటూ స్వాప్నిక జగాలకోసం వెంపర్లాడటం మూర్ఖత్వమని చెప్పిన వివేకానందుడు. ఆధ్యాత్మిక చింతన తోనే నిజమన సర్వసమానత్వ ప్రపంచం ఏర్పడుతుందన్న సత్యాన్ని చెబుతూ తిరిగాడు…. చెబుతూనే ఉన్నాడు..

swami

“విశ్వమంతా బ్రహ్మం నిండి ఉండగా మనము మనని గొప్ప వారని తక్కువ వారని ఎలా అనుకుంటాము?” అసలు ఎక్కువా తక్కువా అంటూ ఏముందని ప్రతీ వస్తువూ,ప్రతీ జీవీ తమతమ పరిదులలో ఈ ప్రపంచాన్ని పరిపూర్ణం చేసేందుకే వచ్చాయి,దేని ప్రత్యేకత దానిదే అయినప్పుదు ఒకరు ఎక్కువా ఒకరు ఎక్కువా అన్న మాటే లేదుకదా అని ప్రశ్నించేవారు…

swami-vivekananda

ప్రపంచానికంతటికీ ఒకేఒక ఆధారం భారతీయ ధర్మం అని నమ్మిన వివేకానందుడు భగవత్ గీతా సారాన్ని ప్రపంచానికందించేందుకు ఎన్నో దేశాల్లో ప్రసంగించారు. ఒక్కోసారి ఆయన అవమానాలనీ,ఆకలినీ భరిస్తూనే తన ప్రయత్నాన్ని ఆపలేదు.వచ్చిన పని పూర్తి అయ్యేవరకూ. 39 ఏళ్ళ పాటు భూమిమీద తనకు ఇవ్వబడిన ఆ పనిని నిర్విరామంగా చేస్తూనే ఉన్నాడు.కొనసాగించమన్న పిలుపుని మన కోసం వదిలి తాను వెళ్ళీపోయాడు… ఎక్కడికీ మనలోకి.,భారత దేశ గాలుల్లో కలిసిన వివేకుడు ఆత్మానాత్మ తేడాని మనకు ప్రభోదిస్తూనే ఇహపరాల రెండు భాద్యతలనూ గుర్తు చేస్తూనే ఉన్నాడు….

(Visited 375 times, 1 visits today)