Home / Inspiring Stories / 40 రూపాయలకు బదులు 4 లక్షలు టోల్ చార్జీగా వసూలు చేసారు.

40 రూపాయలకు బదులు 4 లక్షలు టోల్ చార్జీగా వసూలు చేసారు.

Author:

మంచి రోడ్డుపై ప్రయాణించేటప్పుడు కలిగే ఆనందం టోల్ గేట్ ను చూడగానే ఆవీరైపోతుంది చాలామందికి. కాని 40 రూపాయల టోల్ చార్జీ ని తన డెబిట్ కార్డుతో కట్టిన ఒక మనిషి కి గుండె ఆగినంత పని అయ్యింది. మైసూర్‌కు చెందిన డాక్టర్‌ రావు ముంబాయి కి తన కారు లో ప్రయాణమయ్యాడు. కొచ్చి-ముంబయి జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న డాక్టర్‌ గారు గుడ్మి టోల్‌ ప్లాజా వద్ద 40 రూపాయల టోల్ చార్జీ ని కట్టడానికి టోల్ గేట్ సిబ్బంది కి తన డెబిట్ కార్డ్ ఇచ్చాడు. కార్డును స్వైప్ చేసిన టోల్ గేట్ సిబ్బంది లావాదేవీ పూర్తయ్యిందని అతని కార్డు అతనికి ఇచ్చేసారు. కాని కొంత సమయం తరువాత తన ఖాతా నుంచి రూ.4లక్షలు విత్‌డ్రా అయినట్లు మొబైల్‌కు మెసేజ్ రావడంతో బిత్తర పోయారు డాక్టర్‌ రావు.

toll charges 400000
ఈ సంఘటణ జరిగిన వెంటనే టోల్ గేట్ సిబ్బందిని సంప్రదించగా వారి నుండి ఎటువంటి స్పందన రాలేదు. దానితో టోల్ గేట్ సిబ్బంది పై కోట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు డాక్టర్‌ రావు. పోలీసుల విచారణలో సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే 40 రూపాయలకు బదులు 4 లక్షలు కట్ అయ్యాయని తమ తప్పిదాన్ని ఒప్పుకున్నారు టోల్ గేట్ సిబ్బంది. టోల్ చార్జీ కన్న అధికంగా వసూలు చేసిన రూ.3,99,960 లను చెక్ రూపంలో చెల్లిస్తామని టోల్‌ప్లాజా అధికారులు చెప్పగా దానికి డాక్టర్‌ రావు ఆ డబ్బులు నగదు రూపం లో కావాలని డిమాండ్‌ చేశారు. ఇక చేసేదేమి లేక ఆ రోజు అయిన టోల్ కలెక్షన్ డబ్బులలో నుండి రూ.3,99,960 లను రావు గారికి చెల్లించారు టోల్‌ప్లాజా అధికారులు. మీరు కూడా టోల్ చార్జీలు కట్టేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి.

(Visited 1,208 times, 1 visits today)