Home / Entertainment / షార్ట్ ఫిల్ములు తియ్యండి…సినిమా ఛాన్సులు పట్టండి.

షార్ట్ ఫిల్ములు తియ్యండి…సినిమా ఛాన్సులు పట్టండి.

Author:

ఇప్పుడంతా షార్ట్ జనరేషన్… అందుకే చాలా మంది తన టాలెంట్ ని షార్ట్ ఫిలిం ద్వారా చూపించి షార్ట్ కట్ లో వెండి తెర మీద తన టాలెంట్ చూపించడానికి వస్తున్నారు. ఒక్కప్పుడు సినిమా అవకాశాలు రావాలంటే స్టూడియోల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగిన అవకాశాలు రాలేదు ఇప్పుడు అలాకాదు, నీ దగ్గర టాలెంట్ ఉంటే అవకాశం నిన్నే వెతుకుతూ వస్తుంది. ఆ దారే షార్ట్ ఫిలిమ్స్. ఇలాంటి అవకాశం ఇవ్వడానికి ఒకే రోజు ముగ్గురు దర్శకులు ముందుకు వచ్చారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ మరియు అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ కలసి ఒక షార్ట్ ఫిలిమ్స్ కాంటెస్ట్ పెడుతున్నారు. ఇందులో బెస్ట్ 20 సినిమాలను మల్టీప్లెక్స్ లో ప్రదర్శించి ఉత్తమ దర్శకుడికి  వారి సంస్థలో ఒక సినిమా అవకాశం ఇవ్వనున్నట్లు అభిషేక్ గారు తెలిపారు. ఆ కాంటెస్ట్ కి సంభందించిన వివరాలు క్రింది ఫోటోలో చూడండి.

short movies cinema chances

అలాగే డేరింగ్ & డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్ కూడా ఈ షార్ట్ ఫిలిమ్స్ చేసే వారి కోసం ఒక ప్రకట చేసాడు. ఎవరికైతే షార్ట్ ఫిలిమ్స్ చేయాలని ఉందొ వారు, వారి పూర్తీ వివరాలు పంపితే చాలని ఒక ప్రకటన విడుదల చేసాడు. ఈ మధ్య సూపర్ హిట్స్ తో మంచి జోరు మీద ఉన్న మారుతి కూడా మంచి కంటెంట్ ఉన్న సినిమాలు పంపితే అందులో ప్రతిభ చూపిన వారికి తన  తదుపరి సినిమాలో అవకాశం ఇవ్వనున్నట్లు తెలిపాడు. మరి ఇంకెందుకు ఆలస్యం షార్ట్ ఫిలిమ్స్ తీయండి  మీ అదృష్టాన్ని ఒక్కసారి పరీక్షించుకొండి.

Director Maruthi short film contest

(Visited 125 times, 1 visits today)