Home / Entertainment / బన్నీ కోసం ఆ ముగ్గురు దర్శకులు వెయిటింగ్

బన్నీ కోసం ఆ ముగ్గురు దర్శకులు వెయిటింగ్

Author:

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన విభిన్న నటనతో వరుస విజయాలను సొంతం చేసుకుంటున్నాడు. తన లేటెస్ట్ సినిమా ‘సరైనోడు’ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి సక్సెస్ అవడంతో ఆ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్పుడు తన తదుపరి సినిమా కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఆ జాబితాలో ఎక్కువగా ముగ్గురు దర్శకులు ఎదురుచూస్తున్నారు.

allu-arjun-next film with harish shankar

 

వారిలో ఈ మధ్య ’24’ లాంటి సినిమాతో అందరిని ఆకట్టుకున్న విక్రమ్ కె. కుమార్ ముందు వరుసలో ఉన్నాడు. అలాగే పందెం కోడి,ఆవారా… లాంటి సినిమాలతో అందరి దృష్టి తన వైపు తప్పుకున్న తమిళ దర్శకుడు లింగుస్వామి కూడా ఈ వరుసలో ఉన్నాడు. ఈ దర్శకుడు అల్లు అర్జున్ సినిమా కోసం విశాల్ తో చేయాల్సిన పందెం కోడి-2 సినిమాను కూడా వాయిదా వేస్తూ వస్తున్నాడు. ఇక ఈ రేసులో ఉన్న మరో దర్శకుడు మాత్రం మెగా కుంటుంబానికి ఇప్పటి వరకు రెండు మరచిపోలేని హిట్స్ ఇచ్చిన హరీష్ శంకర్. పవన్ తో గబ్బర్ సింగ్, అలాగే సాయి ధరమ్ తేజ్ తో ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ తీసి హిట్ కొట్టాడు. నిజానికి హరీష్ కి గబ్బర్ సింగ్ తర్వాత బన్నీతో చేసే ఛాన్స్ వచ్చింది. కానీ, అనుకోని కారణాల వలన అది కుదరలేదు.

అల్లు అర్జున్ తన తదుపరి చిత్రం హరీష్ శంకర్ తో చేయబోతున్నట్లు ఆ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా చేయబోతున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. కానీ, ఇది ఎంత మేరకు నిజమో అధికారికంగా తెలియాల్సి ఉంది. ఈ ముగ్గురి దర్శకులలో బన్నీ ఎవరికి ముందు ఛాన్స్ ఇవ్వబోతున్నాడని ఇప్పుడు ప్రశ్నార్ధంకంగా మారింది.

(Visited 290 times, 1 visits today)