Home / Inspiring Stories / ఫేస్ బుక్ ని మోసాన్ని బయటపెట్టిన ట్రాయ్.

ఫేస్ బుక్ ని మోసాన్ని బయటపెట్టిన ట్రాయ్.

Author:

Facebook Free Basics

ప్రముఖ సోషల్‌ మీడియా ఫేస్‌బుక్‌ పై ట్రాయ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రీ బేసిక్స్‌కు మద్దతుగా ఫేస్‌బుక్‌ తన ఖాతాదారుల చేత ట్రాయ్ కు ఇ-మెయిల్స్‌ను పంపించడాన్ని తప్పుపట్టింది. ఇండియా, దక్షిణాది, మధ్య ఆసియా డైరెక్టర్‌ అంఖీదాస్‌ పేరిట ఫేస్‌బుక్‌ వ్యవహరాలకు సంబంధించి రాసిన లేఖలో ట్రాయ్‌ మండిపడింది. ఈ అంశంపై ఆ సంస్థకు ట్రాయ్ లేఖ రాసింది. ఫేస్‌బుక్‌కు ఉన్న విస్తృత ఖాతాదారులను ప్రీ బేసిక్స్‌కు మద్దతుగా ఉపయోగించుకుంటుందని, ఇది పారదర్శకమైందని కాదని విమర్శించింది. ఫేస్‌బుక్‌ చర్యలను ఆమోదిస్తే విధాన నిర్ణయాలపై తీవ్ర ప్రమాదకరమైన ప్రభావాలు పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. మొబైల్‌ డాటా సర్వీసుల కోసం విభిన్న ధరలు నిర్ణయించే విషయమై ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడానికి టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ ఈ నెల 21న బహిరంగ చర్చ ఏర్పాటు చేసింది. ఇంటర్నెట్‌ న్యూట్రాలిటీ (సమానత్వం) విషయంలో డాటా సర్వీసుల ధర అన్నది కీలకాంశం కావడంతో ఈ విషయంలో స్టేక్‌ హోల్డర్స్‌ అంతా తమ అభిప్రాయాలను తెలుపాలని సూచించింది. న్యూఢిల్లీలోని పిహెచ్‌డి హౌస్‌లో ఏర్పాటు చేస్తున్న ఈ చర్చలో ఆసక్తి కలిగిన వారు పాల్గొనాలని ట్రాయ్‌ సూచించింది.

అసలు ఫేస్ బుక్ చేసిన పని ఏంటిదంటే ట్రాయ్ పంపాల్సిన ఇ మెయిల్ ని ఫేస్ బుక్ ముందే ఫ్రీ బేసిక్స్ కి మద్దతుగా ఉన్నట్టు ఒక మెసేజ్ ని రెడీ చేసి మన దేశంలో ఉన్న అందరి ఫేస్ బుక్ అకౌంట్స్ కి పంపింది, దానిలో ఆటోమేటిక్ గా ఫేస్ బుక్ వారి ఫ్రీ బేసిక్స్ కి సపోర్ట్ చేస్తున్నట్టు మెసేజ్ రాసి పెట్టారు, ఫేస్ బుక్ వాడుతున్న వారుకి అసలు విషయాన్ని తెలియనీయకుండా ట్రాయ్ వారికి ఫ్రీ బేసిక్స్ ని సపోర్ట్ చేస్తున్నట్టు ఇ మెయిల్ వెళ్లేటట్టు చేసారు.

facebook free basics mail to Trai

ఇంతకుముందు ఇంటెర్నెట్.ఆర్గ్ అనే ప్రోగ్రామ్ తో భారతదేశానికి వచ్చిన ఫేస్‌బుక్, ఆ కుతంత్రం ఫలించకపోవడంతో మళ్లీ ఇప్పుడు ఫ్రీ బేసిక్స్ పేరుతో మరోసారి భారతీయులకీ ఉన్న ఇంటెర్నెట్ స్వేచ్ఛ వాతావరణాన్ని దెబ్బ తీయాలని చూస్తుంది. ఫ్రీ బేసిక్స్ ద్వారా అందరికి ఇంటెర్నెట్ వస్తుంది కానీ అందులో అన్ని వెబ్‌సైట్లు మనం చూడలేము. ఎవరైతే ఫ్రీ బేసిక్స్ ప్రోగ్రామ్ కి మద్దతు తెలిపి, వారి నియమ నిబంధనలు పాటిస్తారో కేవలం వారి వెబ్‌సైట్ లు మాత్రమే కనపడతాయి. అంటే మనం ఎం వెబ్‌సైట్ లు చూడాలో ఫేస్‌బుక్ నిర్నయిస్తుదన్న మాట. అసలు మనమెందుకు వాళ్ళ పోగ్రామ్ కి మద్దతు తెలిపి మన వెబ్‌సైట్ ని ఫ్రీ బేసిక్స్ కి రిజిస్టర్ చెయ్యడం. ఇప్పుడు మన వెబ్‌సైట్ అందరి కంప్యూటర్ లలో ఓపెన్ ఆవతుంది కానీ ఫ్రీ బేసిక్స్ వస్తే మన వెబ్‌సైట్ మనకు చూపించాలా వద్దా అనేది ఫేస్‌బుక్ డిసైడ్ చేస్తుంది.అంటే ముందు మనకేం కావాలో అది తానే విక్రయించటం మొదలు పెడుతుందన్నమాట.ఇప్పుడు జనాలకి ఫ్రీ గా అలవాటు చేసి తర్వాత చాలా మంది దానికి అలవాటు పడిన తర్వాత ఎలాగైనా లాభాలు పోందుతామన్న దుష్ట కార్పొరేట్ ఆలోచనతో మన ముందుకు వస్తుంది.

అంతే కాకుండా ఫ్రీ బేసిక్స్ వల్ల ఎక్కువగా నష్టపోయేది చిన్న చిన్న కంపనీలే, ఎందుకంటే పెద్ద కంపనీ అయితే ఫేస్ బుక్ వాళ్ళకి డబ్బులిచ్చి వాళ్ళ వెబ్ సైట్స్ మాత్రమే వచ్చేటట్టు చేసుకుంటారు, చిన్న చిన్న కంపెనీలు అంత డబ్బులు ఇవ్వలేవు, ఇప్పుడిప్పుడే మన దేశంలో చిన్న కంపెనీలు (స్టార్ట్ ఆప్) అబివృద్ది చెందుతున్నాయి కావున ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల సాధారణ ప్రజలు టాలెంట్ ఉన్న కంపెనీలు నడిపించలేరు.

(Visited 1,291 times, 1 visits today)