Home / Technology / ఫోన్ బ్యాటరీ ఎక్కువ సేపు పనిచేయాలంటే ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.

ఫోన్ బ్యాటరీ ఎక్కువ సేపు పనిచేయాలంటే ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.

Author:

 

ఈ డిజిటల్ ప్రపంచం లో ఒక్క క్షణం మొబైల్ దగ్గర లేకపోయినా, ఆఫ్ అయినా ఎన్నో పనులు ఆగిపోతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు, బ్యాంకు లావా దేవీలు, ఇంటి పనులు, ఆఫీసు పనులు, ఫుడ్డు, షాపింగ్, బిజినెస్… అంతెందుకు టైం కి ఫోన్ ఎత్తకపోతే కాపురాలు కూడా కూలిపోయే ప్రమాదం కూడా ఉంది. ఈ మొబైల్ రెవల్యూషన్ వల్ల ప్రపంచమే చిన్నదై, అరచేతిలోకి వచ్చేసింది. మరి అలాంటి మొబైల్ ను ఆఫ్ అవకుండా ఎప్పటికి ఫుల్ బ్యాటరీతో ఉంచాలంటే ఎంత కష్టమో మనందరికీ తెలుసు. అందుకే చాలా అమంది ఒక పవర్ బ్యాంకుని కొనేసి వాడేస్తున్నారు. ఎంత మంచి బ్యాట‌రీ ఉన్న ఫోన్ కొన్నా ఎక్కువ పవర్ బ్యాక‌ప్ రావ‌డం లేద‌ని చాలా మంది కంప్లెయింట్ చేస్తుంటారు. కాని కొన్ని సింపుల్ సలహాలు, సూచ‌న‌ల‌ను పాటిస్తే మీ స్మార్ట్‌ఫోన్ బ్యాట‌రీ ఎక్కువ కాలం నిలుస్తుంది. మరి ఆ చిట్కాలేంటో చదవండి.

save phone battery

1) ముందు మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉండే వైబ్రేష‌న్ ఫీచ‌ర్‌ను ఆఫ్ చేయండి. ఎందుకంటే వైబ్రేష‌న్ ఆన్‌లో ఉండ‌డం వ‌ల్ల ఎక్కువ బ్యాట‌రీ ఖర్చైపోతుంది. కాల్స్, మెసేజ్ లు, యాప్‌ల‌కు చెందిన నోటిఫికేష‌న్లు వ‌చ్చిన‌ప్పుడు వ‌చ్చే వైబ్రేష‌న్, ఏదైనా మ్యాటర్ టైప్ చేస్తున్న‌ప్పుడు వ‌చ్చే వైబ్రేష‌న్‌లు అన్నింటినీ ఆఫ్ చేయాలి. దీంతో బ్యాట‌రీ బ్యాక‌ప్ కొంత వ‌ర‌కు పెరుగుతుంది.

2) అవసరం లేనప్పుడు జీపీఎస్‌, బ్లూటూత్‌, ఇన్‌ఫ్రారెడ్ వంటి సెన్సార్లు ఆఫ్ చేయాలి, ఎప్పుడూ ఆన్‌లో ఉంచ‌వ‌ద్దు. వీటిలో ఏవి ఆన్‌లో ఉన్నా బ్యాట‌రీ ఎక్కువ‌గా వినియోగం అవుతుంది. అవ‌స‌రం అనుకుంటే తప్ప వీటి జోలికి వెళ్లకపోవడం బెటర్.

3) క‌ల‌ర్‌ఫుల్ వాల్‌పేప‌ర్లు, అనిమేటెడ్ వాల్‌పేప‌ర్లు తీసేసి, బ్లాక్ ఆండ్ వైట్ వాల్‌పేప‌ర్ల‌నే సెట్ చేసుకోండి. బ్లాకండ్ వైట్ వాల్‌పేప‌ర్లు చాలా త‌క్కువ బ్యాట‌రీని వాడుకుంటాయి. అదే క‌ల‌ర్‌ వాల్‌పేప‌ర్లు బ్యాట‌రీని మింగేస్తాయి.

4) మీ ఫోన్‌కు చెందిన ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ సాఫ్ట్‌వేర్‌ను ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్ చేసుకోండి. ప్రతి ఫోన్ కంపెనీ కూడా ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ ఇస్తుంటాయి. అప్డేట్ చేస్కోవడం వల్ల బ్యాట‌రీ స‌మ‌స్య‌లు పోయి, బ్యాక‌ప్ పెరుగుతుంది.

5) అవ‌స‌రమయితే తప్ప మొబైల్ డేటాను ఆన్ చేయకండి. డేటా ఆన్లో ఉంటే ఎక్కువ బ్యాట‌రీ వేస్టవుతుంది.

6) ఫోన్ లో అనవసరపు విడ్జెట్ల‌ను తీసేస్తే బ్యాట‌రీ బ్యాక‌ప్ పెరుగుతుంది. చాలా మంది హోం స్క్రీన్ పై మ్యాప్స్‌, మ్యూజిక్‌, గ్యాల‌రీ వంటి ర‌క ర‌కాల విడ్జెట్ల‌ను పెడ‌తారు. కానీ వీటివ‌ల్ల బ్యాట‌రీ బాగా వృథా అవుతుంది. కాబట్టి ఫోన్‌లో ఉండే ఆటోమేటిక్ సింక్ ఆప్ష‌న్‌ను డిజేబుల్ చేసి, అవ‌స‌రమనుకున్న‌ప్పుడే ఆన్ చేయాలి.

7) లాలిపాప్ అంత క‌న్నా త‌క్కువ వెర్ష‌న్ ఉన్న ఫోన్ల‌ను వాడేవారు ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలోకు అప్‌గ్రేడ్ అవ్వాలి. ఎందుకంటే ఆండ్రాయిడ్ 6.0, త‌రువాత వ‌చ్చిన ఆండ్రాయిడ్ 7.0 లో డోజ్ మోడ్ అనే ఫీచ‌ర్ ల‌భిస్తోంది. యూజ‌ర్ ఎక్కువ సేపు ఫోన్‌ను వాడ‌కుండా ఉంటే ఆటోమేటిక్‌గా బ్యాట‌రీ ఆదా అయ్యేలా చేస్తుంది ఈ ఫీచర్. సో యూజ‌ర్లు త‌మ ఆండ్రాయిడ్ ఓఎస్‌ను అప్‌గ్రేడ్ చేసుకుంటే బాటరీ సేవవుతుంది.

(Visited 1,993 times, 1 visits today)