Home / Political / త్రిష ఆ ఎమ్మెల్యే ని ఇలా ఎందుకు తిట్టింది?

త్రిష ఆ ఎమ్మెల్యే ని ఇలా ఎందుకు తిట్టింది?

Author:

horse-story_647_031516104231

పోలీసు గుర్రం కాలు విరగ్గొట్టిన బీజేపీ ఎమ్మెల్యే తీరుపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ఆయన మాత్రం ఏ తప్పూ చేయలేదని చెబుతున్నారు. వీడియో సాక్ష్యం ఉన్నప్పటికీ గుర్రాన్ని కొట్టలేదని అన్నారు. ఉత్తరాఖాండ్‌ ముఖ్యమంత్రి హరీష్‌రావత్‌కు వ్యతిరేకంగా డెహ్రాడూన్‌లో బీజేపీ తలపెట్టిన నిరసన ప్రదర్శనలో ఆ పార్టీ ఎమ్మెల్యే గణేష్‌ జోషి రెచ్చిపోయారు. ఓ పోలీస్‌ వద్ద లాఠీ లాక్కుని అక్రడున్న గుర్రాన్ని కొట్టారు. దాంతో ఆ గుర్రం కాలు విరిగింది.ఎమ్మెల్యే దాడిలో గాయపడిన పోలీస్‌ గుర్రం కాలు తీసేయాల్సి వస్తుందని పశువైద్య నిపుణులు తేల్చి చెప్పారు. దీంతో జంతు ప్రేమికులంతా ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. అయితే గుర్రంపై దాడి చేయలేదని ఎమ్మెల్యే అన్నారు. సంఘటన స్థలం నుంచి తాను వెళ్లిపోయిన తర్వాతే గుర్రం గాయపడిందని జోషి చెప్పారు.

trisha tweet on mla
అయితే ఈ వార్తని చానెల్లో చూసిన సినీ హీరోయిన్ త్రిష తన ట్విట్టర్ లో ఆ వార్త లింక్ పెడుతూ ”నీకు (ఎమ్మెల్యేకు) నరకంలో అయినా శిక్ష పడాలని ప్రార్థిస్తున్నాను, ఇది సిగ్గుచేటు అయిన చర్య” అంటూ స్పందించింది.ఈ ట్వీట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మూగజీవం అని చూడకుండా విచక్షణా రహితంగా కొట్టడానికి ఆ ప్రజా ప్రతినిధికి చేతులెలా వచ్చాయంటూ పలువురు సోషల్ మీడియాలో విమర్శిస్తూ పోస్టులు పెడుతున్నారు.

(Visited 108 times, 1 visits today)