Home / Entertainment / ప్రయోగాల హీరో తో ఫ్యామిలి డైరెక్టర్ సినిమా ముహుర్తం?

ప్రయోగాల హీరో తో ఫ్యామిలి డైరెక్టర్ సినిమా ముహుర్తం?

Author:

suriya-trivikram

తెలుగు సినీ పరిశ్రమలో మాటలతో మ్యాజిక్ చేస్తూ,సంక్లిష్టంగా కాకుండా సరళంగా జీవితాన్ని జీవించమనే సినీ తాత్త్వికుడు త్రివిక్రమ్‌. నేను మాటలు రాస్తాను కాని..మాట్లాడను అంటు అర్థవంతమైన సినిమాలను రూపొందించే త్రివిక్రమ్‌ శైలి, మాటల రచయితగా స్వయంవరం సినిమాతో తెరంగేట్రం చేసాడు. నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మథుడు వంటి సినిమాలకు కథ, స్క్రీన్‌ప్లే రచయితగా ఆయన స్టార్‌డమ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. దర్శకుడిగా తన తొలి సినిమా తప్ప మిగతా వన్నీ ఆయన మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లతో చేసినవే. ఈ ముగ్గురు హీరోలతో రెండేసి సినిమాలు చేసాడు త్రివిక్రమ్. చాలా కాలం తరువాత త్రివిక్రమ్ రూటు మార్చారు. నితిన్ లాంటి మధ్య స్థాయి హీరోతో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు.

ప్రస్తుతం నితిన్‌తో ‘అ..ఆ..’ అనే సినిమా చేస్తోన్న త్రివిక్రమ్, ఆ తర్వాత తమిళ సూపర్ స్టార్ సూర్యతో కలిసి ఓ ద్విభాషా చిత్రం చేయనున్నారన్న వార్త కొన్నాళ్ళుగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే.సూర్య సినిమాలకు తమిళంలో ఎంత క్రేజ్ ఉంటుందో, తెలుగులోనూ అంతే క్రేజ్ ఉంటుంది. వాణిజ్య అంశాలు వదులుకోకుండా విభిన్న ప్రయత్నాలు చేస్తుంటారాయన.గజినితో తెలుగులో మంచి స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులో ఇప్పటికే తనకున్న మార్కెట్‌ను రెట్టింపు చేసుకునే దిశగా సూర్య, త్రివిక్రమ్‌తో జతకట్టేందుకు ఓకే చెప్పారు. ఇక ఈ కాంబినేషన్‌లో సినిమా కోసం త్రివిక్రమ్ కూడా ఓ మంచి కథను సిద్ధం చేశారు.

ఇక తాజాగా సూర్య-త్రివిక్రమ్‌ల సినిమా ఎప్పుడు సెట్స్‌పైకి వెళుతుందనే విషయమై ఓ స్పష్టమైన టైమ్ తెలుస్తోంది. జూలై నెలలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ళేలా ప్లాన్ చేస్తున్నారు. అప్పటికి సూర్య ప్రస్తుతం చేస్తోన్న ‘సింగం 3’ కూడా పూర్తవుతుంది. దీంతో జూలైలో సినిమాను మొదలుపెట్టి మళ్ళీ సంక్రాంతికి కానీ, సమ్మర్‌కి కానీ సినిమాను పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

(Visited 162 times, 1 visits today)