Home / Entertainment / మాటల మాంత్రికుడి మల్టీ స్టారర్

మాటల మాంత్రికుడి మల్టీ స్టారర్

Author:

Nagarjuna with Bunny

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్… నితిన్, సమంతా, అనుపమ పరమేశ్వరన్ కాంబినేష్ లో ‘అ..ఆ’ మూవీ వస్తుంది. ఇప్పటికే ఈ సినిమా 80 శాతం షూటింగ్ ని పూర్తిచేసుకుంది. అలాగే ఫిబ్రవరి 14న ప్రపంచ ప్రేమికుల దినోత్సవంగా రావాల్సి ఉండగా, కొద్దిగా లేట్ అయ్యింది. ఈ సినిమా తర్వాత తమిళ హీరో సూర్య తో ఓ ద్విబాష చిత్రం చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అవి నిజమే అయినప్పటికీ ఈ ఇద్దరి కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్ళడానికి కొంత సమయం పట్టనుందట. అయితే ఈ గ్యాప్ లో త్రివిక్రమ్ ఓ మల్టీ స్టారర్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడట. ఇప్పటికే ఈ చిత్రంలో బన్నీ ని ఒక హీరోగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మరో హీరో గా అక్కినేని నాగార్జునను తీసుకుంటే బాగుంటుందని ఆలోచిస్తున్నారట. బన్ని సరైనోడు సినిమా త్వరలో పూర్తి అవ్వనుంది అలాగే నాగ్ ‘ఊపిరి’ కూడా షూటింగ్ పూర్తి అయ్యింది కావున ఈ సినిమా అతితోందరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

(Visited 276 times, 1 visits today)