Home / Entertainment / సీట్ల సంఖ్యకు మించి ప్రయాణికులను బస్సుల్లో ఎక్కించరాదని ఆర్టీసీ ఆదేశాలు

సీట్ల సంఖ్యకు మించి ప్రయాణికులను బస్సుల్లో ఎక్కించరాదని ఆర్టీసీ ఆదేశాలు

Author:

ఇటీవల జరిగిన కొండగట్టు బస్సు ప్రమాదంతో ఆర్టీసీ కళ్లు తెరిచింది. ప్రమాద సమయంలో బస్సులో వందకు పైగా ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం జరిగినప్పుడు ఒకరిపై ఒకరు పడటంతో ఊపిరాడక ఎక్కువ మంది చనిపోయారని అధికారుల విచారణలో తేలింది.

ఆర్టీసీ ఆదాయాన్ని పెంచేందుకు సిబ్బంది బస్సుల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుంటుంటారు.  అయితే బస్సు యాక్సిడెంట్ల చరిత్రలోనే అత్యంత విషాదకరమైన కొండగట్టు ప్రమాదం తర్వాత అధికారులు మేల్కొన్నారు.

ఆక్యుపెన్సీ రేటు సంగతి అటుంచితే.. ముందు ప్రమాదాల సంఖ్య  తగ్గించి.. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. ఆర్టీసి అధికారులు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. సీట్ల సంఖ్యకు మించి ప్రయాణికులను బస్సుల్లో ఎక్కించరాదని,  అత్యవసరం అనిపిస్తేనే అదనపు ప్రయాణికులకు బస్సులో చోటు కల్పించాలని సిబ్బందికి సూచించారు.

ఎమర్జెన్సీ పరిస్థితుల్లో బస్సులో ఎందుకు ఎక్కువ మందిని ఎక్కించుకోవాల్సి వచ్చిందే వివరిస్తూ.. ఓ నోట్ ను డిపోమేనేజర్ కు పంపాలని.. ఆర్టీసీ ఇంచార్జ్ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ ఉత్తర్వులు ఇచ్చారు. బస్సు ఒక ట్రిప్పు తిరిగినప్పుడు వచ్చిన ఆదాయంతో పాటు ఎంత మంది ప్రయాణించారన్న వివరాలను కూడా తెలపాలని డిపో అధికారులకు చెప్పారు.

(Visited 1 times, 1 visits today)