Home / Inspiring Stories / మరోసారి తన పనితనాన్ని చూపించిన కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు.

మరోసారి తన పనితనాన్ని చూపించిన కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు.

Author:

ఇప్పుడున్న సోషల్ మీడియా వలన చాలా ప్రయోజనాలు జరుగుతున్నాయి.ముఖ్యంగా ఏవైనా తప్పు పనులు జరుగుతుంటే జరిగిన ప్రదేశం , జరిపిన మనిషి వివరాలు సంబంధిత అధికారులకు గాని, సంబంధిత మంత్రికిగాని ఒక్క ట్వీట్  చేస్తే చాలు మీకు జరిగిన అన్యాయానికి న్యాయం జరుగుతుంది. అందులో ముఖ్యంగా రైల్వే శాఖలో ఇప్పటి వరకు ఇలాంటివి చాలా జరిగాయి. సంబంధిత కేంద్ర రైల్వే మంత్రి ఇలాంటి విషయాలలో చాలా తొందరగా పరిష్కారం చూపిస్తున్నాడు. మీకు రైల్లో ఏదైనా సంఘటన  జరిగిన లేదా అందులో ఎలాంటి అసౌకర్యం కలిగిన వెంటనే ఒకే ఒక ట్వీట్ చేస్తే చాలు మీకు వచ్చే  స్టేషన్లో దానికి పరిష్కారం లభిస్తుంది.

tweet-complaint-railways-suspended-the-tiicket-inspector

గత శనివారం రోజు గోవింద్ నారాయణ అనే ఒక ప్యాసింజర్, బార్మర్ – కల్కా ఎక్స్ ప్రెస్ లో ప్రయాణం చేస్తుండగా అనుకుపోకుండా టికెట్ కలెక్టర్ వచ్చి అందరిని టికెట్ చెకింగ్ చేస్తున్నాడు. అలా చేస్తున్న సమయంలో చాలా మంది దగ్గర అదనంగా 15 రుపాలు తీసుకోని వారికి సీట్స్ కేటాయించాడు. ఇదేంటి సార్ మేము కూర్చోవాల్సిన సీట్లో వారిని కూర్చోబెడుతున్నావు అన్నందుకు కావంటే నువ్వు 15 రూపాయలు ఇవ్వు నీకు కూడా సిట్ ఇప్పిస్తా! అనడంతో  జరిగిన విషయాన్ని కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభుకి ట్వీట్ చేశాడు. అంతే  వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఒక స్టేషన్ నుండి మరో స్టేషన్ కు వెళ్లే సమయంలో టికెట్ కలెక్టర్ ని సస్పెండ్ చేయడం జరిగింది.  ఇదే విషయాన్ని ట్వీట్ చేసిన నారాయణకు మళ్ళీ రీ ట్వీట్ ద్వారా సురేష్ ప్రభు గారు తెలిపారు. ఒకే ఒక ట్వీట్ సంబంధిత మంత్రి నుండి అధికారుల వరకు అన్ని పనులు జరుగుతున్నాయి అంది సోషల్ మీడియా పవర్ అంటే..

(Visited 658 times, 1 visits today)