Home / Entertainment / తుంటరి సినిమా రివ్యూ & రేటింగ్.

తుంటరి సినిమా రివ్యూ & రేటింగ్.

Author:

Tuntari Cinema perfect review and rating

తమిళంలో ”మాన్ కరాటే”గా తెరకెక్కిన సినిమాను తెలుగులో నారా రోహిత్, లతా హెగ్డే జంటగా “గుండెల్లో గోదారి” ఫేమ్ కుమార్ నాగేంద్ర దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘తుంటరి’. తమిళ రీమెక్ అయిన ఈ చిత్రానికి ఆఋ మురుగదాస్ ఈ చిత్రానికి కథ అందించడం విశేషం. ఈ రోజు మన ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో ఒక్క సారి చూద్దాం.

కథ :

వెన్నెల కిషోర్ తన ఫ్రెండ్స్ తో ఓ రోజు అనంతగిరి ఫారెస్ట్ కు వెళ్ళతాడు.. అక్కడ ఓ స్వామిజి కనిపించి ఓ పేపర్ ని వరంగా ఇస్తాడు..అందులో ఏమి ఉన్నాయో అవి నిజజీవితం లో జరుగుతుంటాయి..అలాగే రాజు అనే బాక్సర్ ద్వారా నీకు , నీ ఫ్రెండ్స్ కు 5 కోట్లు వస్తాయని రాసి ఉంటుంది..దాంతో ఆ రాజు కోసం వెతకడం మొదలు పెడతారు..చివరికి రాజు దొరుకుతాడు, ఆ రాజే మన నారా రోహిత్.

కానీ రాజు కు బాక్సింగ్ మీద ఇంటర్స్ట్ ఉండదు. కానీ నువ్వు బాక్సింగ్ చేస్తే రోజుకు లక్ష ఇస్తామని చెపుతారు. అలా బాక్సింగ్ పోటిలో పాల్గొనగా అదే పోటిలో మరో రాజు (కబీర్ దుహన్ సింగ్) ఎదురువుతాడు..ఆ సమయం లో వెన్నెల కిషోర్ మనం వెతికేది ఈ రాజునా లేక ఆ రాజునా అనే సందేహం లో పడతాడు..ఇంతకి అసలు రాజు ఎవరు..? ఆ 5 కోట్లు ఎవరికీ దక్కుతాయి..? రాజు మనసులోకి సిరి ( లతా హెగ్డే) ఎలా వస్తుంది అనేది మీరు తెరఫై చూడాల్సిందే..

అలజడి విశ్లేషణ:

ఒక పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేసే ఐదుగురు ఫ్రెండ్స్ (కిశోర్, ఆనంద్, సుదర్శన్, కల్కి, పూజిత) కలిసి అనంతగిరి అడవులకు పిక్నిక్ కోసం వెళ్తారు. అక్కడ ఓ సాధువును కలుస్తారు. ఆ సాధువును కలిసిన సందర్భంగా ఈ ఐదుగురికి భవిష్యత్తుకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం తెలియవస్తుంది. నాలుగు నెలల తరువాత జరగబోయే ఓ బాక్సింగ్ మ్యాచ్లో రాజు అనే వ్యక్తి గెలుస్తాడని.. అతనికి రూ.ఐదుకోట్లు లభించనున్నాయని చెప్తాడు. ఆ రాజు (నారా రోహిత్) బిఎస్ఎన్ఎల్లో పనిచేసే ఆనందరావు గారి అబ్బాయి అని ఆ ఐదుగురు స్నేహితులకు తెలియవస్తుంది. ఇంతలో సిరి (లతా హెగ్డే)తో ప్రేమలో పడతాడు రాజు.బాక్సింగ్ ప్రాక్టీస్ సమయంలో ఆ ఐదుగురు స్నేహితులకు ఓ షాక్ తగుల్తుంది. ఇప్పటికే చాలాసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఆ టాప్ బాక్సర్ పేరు కూడా రాజు (కబీర్ దుహన్ సింగ్) అని తేలడంతో పాటు అతడి తండ్రిపేరు కూడా ఆనందరావు అని తెలియవస్తుంది. అతను కూడా బిఎస్ఎన్ఎల్లోనే ఉద్యోగం చేస్తున్నాడని తెలుస్తుంది. దీంతో షాక్ తినే ఆ ఐదుగురు స్నేహితులు లోకల్ రాజు ఓడిపోతాడని, ఛాంపియన్ రాజే గెలుస్తాడనే అనుకుంటారు. అయితే చివరికి ఏ రాజు గెలుస్తాడు. స్వామీజీ ఇచ్చిన మాట ఏమవుతుంది. ఆ ఐదుగురు స్నేహితులకు ఐదు కోట్లు లభిస్తాయా.. రాజు సిరి ప్రేమను ఎలా పొందుతాడు అనేది మిగతా కథ.

ఇప్పటివరకు డీసెంట్‌ పాత్రల్లో మెప్పించిన నారా రోహిత్ తొలిసారిగా లోకల్ రాజు పాత్రలో మాస్ క్యారెక్టర్ను ట్రై చేశాడు. ముఖ్యంగా కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్న రోహిత్, తనకు బాగా పట్టున్న ఎమోషనల్ సీన్స్లోనూ మెప్పించాడు. కానీ బొద్దుగా కనిపించి.. రోహిత్ లుక్‌ను పాడు చేసుకున్నాడు. లవ్ సీన్స్‌లో ఇబ్బంది పెట్టాడు. బాక్సర్‌గా కాస్త సరిపోయాడు. హీరోయిన్,మిస్ న్యూజిలాండ్ లతా హెగ్డే పాత్రకు న్యాయం చేసింది. రాజును గెలిపించాలనుకునే ఐదుగురు ఫ్రెండ్స్‌గా వెన్నెల కిశోర్, ఆనంద్, సుదర్శన్, కల్కి, పూజితాలు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. కబీర్ దుహన్ సింగ్ విలన్ పాత్రకు సూపర్‌గా సూట్ అయ్యాడు. షకలక శంకర్ కామెడీ బాగుంది. బాక్సింగ్ రిఫరీగా ఆలీ కామెడీ పండింది.

సాంకేతిక వర్గం పనితీరు:

తమిళ సినిమాకు రీమేక్ అయినా.. ఎక్కడా ఆ ఛాయలు లేకుండా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు కుమార్ నాగేంద్ర. ముఖ్యంగా క్రీడా నేపథ్యం ఉన్న కథ కావటంతో నేటివిటి సమస్య పెద్దగా కనిపించలేదు. హీరో క్యారెక్టరైజేషన్లో కొత్తదనంతో ఆకట్టుకున్నాడు. రోహిత్లోని కామెడీ యాంగిల్ను ఆడియన్స్కు పరిచయం చేయటంలో మంచి విజయం సాధించాడు. ఒరిజినల్ సినిమాలా రెండున్నర గంటల పాటు సినిమాను సాగదీయకుండా, రెండు గంటలకు తగ్గించి దర్శకుడు మంచి నిర్ణయం తీసుకున్నాడు. సాయి కార్తీక్ సంగీతం బాగుంది. పాటలతో పర్వాలేదనిపించిన కార్తీక్ నేపథ్య సంగీతంతో ఆకట్టుకున్నాడు. ప్రతీసీన్ను తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్తో మరింత ఎలివేట్ చేశాడు. పలనీ కుమార్ సినిమాటోగ్రఫి, మధు ఎడిటింగ్ బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్:

  • నేపథ్య సంగీతం
  • నారా రోహిత్ కామెడీ టైమింగ్
  • స్టోరీ స్క్రీన్ ప్లే

మైన‌స్ పాయింట్స్‌:

  • కామెడీ
  • క్లైమాక్స్‌
  • పంచ్‌లు మిస్స‌యిన డైలాగ్స్‌.

అలజడి రేటింగ్: 3/5

                                         పంచ్ లైన్: “తుంటరి”తనం ఎక్కువైంది ఎమోషన్ తక్కువైంది.

(Visited 744 times, 1 visits today)