Home / Political / మరో విషాదం లో జపాన్-గంటల వ్యవదిలోనే రెండు భూకంపాలు

మరో విషాదం లో జపాన్-గంటల వ్యవదిలోనే రెండు భూకంపాలు

Author:

ప్రపంచాన్ని భూకంపాలు పట్టికుదిపేస్తున్నాయి. మొన్న ఆఫ్ఘనిస్తాన్ లో భూకంపం చోటుచేసుకోగా, నిన్న మయన్మార్ ను భూకంపం పట్టి కుదిపేసింది. ఈ రెండు భూకంపాల తీవ్రతకు భారత్ లోని కొన్ని ప్రాంతాలు కంపించాయి. తాజాగా జపాన్ లో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టరు స్కేలుపై 6.4 గా నమోదైంది. కుష్యూలోని కుమామోటో ప్రాంతంలో భూమిలోపల పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని జపాన్ అధికారులు వెల్లడించారు. అయితే సునామీ హెచ్చరికలు జారీ చేయకపోవడంతో తీరప్రాంతదేశాలు హాయిగా ఊపిరి పీల్చుకున్నాయి.

Twin Earthquakes Kill At Least 16 In South Japan; Many Trapped 02
అయితే ఘ‌ట‌న మ‌రువ‌క ముందే మ‌రో భారీ భూకంపం జపాన్ ప్ర‌జ‌ల‌ను వ‌ణికించింది.దక్షిణ జపాన్ లో ఈ ఉదయం పెను భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రతగా నమోదైన ఈ భూకంపం ఆ దేశంలో భారీ నష్టాన్ని మిగిల్చింది. జపాన్ లోని ఈకీ ప్రాంతంలో సంభవించిన ఈ భూకంపం దాటికి 9 మంది మృత్యువాత పడ్డారు. దాదాపు 800 మంది గాయాలపాలయ్యారు. యాభై మంది పరిస్థితి విషమంగా వుంది. ఘటన తరువాత పలుమార్లు ప్రకంపణలు వచ్చినట్లు కుడా సమాచారం. పెద్ద సంఖ్యలో ఇళ్లు నేలమట్టమయ్యాయి. పలుచోట్ల అగ్నీ రాజుకుంది. పలు రహదారులపై పగుళ్లు ఏర్పడ్డాయి. ఇళ్ల శిథిలాల కింద పెద్ద సంఖ్యలో జనం చిక్కుకున్నట్లు సమాచారం.

Twin Earthquakes Kill At Least 16 In South Japan; Many Trapped

భూకంపం సంభవించిన వెంటనే రంగంలోకి దిగిన సహాయక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టారు.మషికీ ప్రాంతంలో ఇద్దరు మృతిచెందారు. కోటోహిరా ఆలయం పూర్తిగా ధ్వంసమయింది. దాదాపు యాభై వేలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భూకంపం కారణంగా సంభవించిన నష్టం అపారంగా ఉందని విపత్తు శాఖ తెలిపింది.మరో వారం రోజుల్లో భూ ప్రకంపనలు సంభవించే ప్రమాదం కుడా వుందని హెచ్చరించింది. భూకంపంపై సమాచారం అందుకున్న వెంటనే స్పందించిన ప్రధాని షింజో అబే… సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. భూకంప కేంద్రం భూమి లోతు పోరల్లో కేంద్రకృతమయిందని, దీంతో సునామీ ప్రమాదం వుండదని షింజో ఆబే వివరించారు. భార‌త కాల మాన ప్ర‌కారం శుక్ర‌వారం రాత్రి 10 గంట‌లు త‌ర్వాత క్యూషూ ద్వీపంలో భారీ ప్ర‌కంప‌నలు వ‌చ్చిన‌ట్లు అధికారులు తెలిపారు. దీని తీవ్ర‌త రిక్ట‌ర్ స్కేల్ పై 7.0 గా న‌మోదైంది. దీంతో అమెరికా జియోలాజిక‌ల్ స‌ర్వే సునామీ హెచ్చ‌రికలు కూడా జారీ చేశారు. దీంతో జ‌పాన్ ప్ర‌జ‌లు భ‌యాందోళ‌ను గుర‌వుతున్నారు. ఎటు నుంచి ఎలాంటి ప్ర‌మాదం ముంచుకోస్తుంద‌ని తెలియ‌క అధికారులు సైతం ఆందోళ‌న‌కు గుర‌వుతున్నట్లు స‌మాచారం.

(Visited 1,379 times, 1 visits today)