Home / Entertainment / ధుర్ముఖీ నామ సంవత్సరం లో మీ రాశి ఆదాయ, వ్యయంలు ఎలా ఉన్నాయి

ధుర్ముఖీ నామ సంవత్సరం లో మీ రాశి ఆదాయ, వ్యయంలు ఎలా ఉన్నాయి

Author:

తెలుగు సంవత్సరాది ఉగాది.. ఈ సంవత్సరం పేరు దుర్ముఖీ నామ సంవత్సరం. తెలుగు సంవత్సరాలు అరవై అని మీకు తెలుసుకదా… తెలుగు సంవ‌త్స‌రాల వెనుక ఓ కథ ఉంది. నారద మహాముని ఓసారి విష్ణు మాయ వల్ల స్త్రీగా మారి, ఓ రాజును పెళ్లాడతాడు. వారికి 60 మంది సంతానం జన్మిస్తారు. ఓసారి ఆ రాజు తన సంతానంతో యుద్ధానికి వెళితే అంతా చనిపోతారు. అప్పుడు ప్రార్థించిన నారదుడిని విష్ణువు కరుణిస్తాడు. నీ పిల్లలు 60 సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతుంటారు అని వరమిస్తాడు. అవే మన తెలుగు సంవత్సరాలుగా ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి…. అయితే చరిత్ర ప్రకారం శాలివాహన శకం ఆరంభమైన రోజే ఉగాది అనికూడా అంటారు..
మనకు అసలైన నూతన సంవత్సరం ఉగాదే. ఇప్పటి నుండే మన వాతావరణంలో మార్పు మొదలవుతుంది. పంచాగం మొదలవుతుంది. సృష్టి మొదలవుతుంది. అందుకే ఇది యుగ ఆది అయింది. అదే ఉగాది అయింది.ఈ రోజున పంచాంగ శ్రవనం అనేది ఆచారంగా వస్తున్నది… అయితే మారిన జీవితాల్లో అంత తీరిక లేకపోవటం వల్ల మన సాంప్రదాయాలకు దూరం జరిగాం…. అయితే పంచాంగ శ్రవణాన్ని పంచాంగ పఠనం గా మారిస్తే? అన్న ఆలొచన త్పనే మీ కోసం ఈ ధుర్ముఖీ నామ సంవత్సర రాశిఫలాలను ఇక్కడ అందిస్తున్నాం… ఉగాది పచ్చడి తినేసాక… ఈ సంవత్సరం మీ రాశి ఫలం ఏమిటో తెలుసుకోండి… ఉగాది శుభాకంక్షలతో అలజడి.కాం

1) మేషం:
ఆదాయం -2, వ్యయం-8. రాజ్యపూజ్యం-1 అవమానం -7

2) వృషభం:
ఆదాయం -11, వ్యయం-14. రాజ్యపూజ్యం -4,అవమానం -7.

3) మిధునం:
ఆదాయం – 14, వ్యయం-11. రాజ్యపూజ్యం-7,అవమానం -7.

4) కర్కాటక:
ఆదాయం -8 వ్యయం-11. రాజ్యపూజ్యం-3, అవమానం -3.

5) సింహం:
ఆదాయం – 11, వ్యయం 5. రాజ్యపూజ్యం – 6,అవమానం -3.

6) కన్య రాశి:
ఆదాయం -14, వ్యయం -11. రాజ్య పూజ్యం -2, అవమానం -6.

7) తుల రాశి :
ఆదాయం -11 వ్యయం -14. రాజ్య పూజ్యం – 5, అవమానం -6

8) వృశ్చిక రాశి:
ఆదాయం -2, వ్యయం -8. రాజ్య పూజ్యం -1, అవమానం -2.

9) ధను రాశి:
ఆదాయం -5, వ్యయం -14. రాజ్య పూజ్యం-4, అవమానం -2

10) మకర రాశి :
ఆదాయం -8, వ్యయం -8. రాజ్యపూజ్యం-7 అవమానం -2.

11) కుంభ రాశి :
ఆదాయం -8 వ్యయం -8 . రాజ్య పూజ్యం -3 అవమానం -5.

12) మీన రాశి:
ఆదాయం -8, వ్యయం -14 . రాజ్య పూజ్యం -6, అవమానం -5

ఈ సంవత్సం ఎవరెవరికి ఉగాది లక్ష్మీ అనుగ్రహం ఉందో తెలుసుకోండి… ఆదాయాన్ని వ్యయాన్నీ సరిచూసుకొని ఆనందంగా మీ ఆర్థిక సంవత్సరాన్నీ ప్లాన్ చేసుకోండి..

Read Also:  ఉగాది పండుగ చరిత్రని తెలుసుకోండి.

 

(Visited 26,965 times, 1 visits today)