Home / Inspiring Stories / దర్శకరత్న దాసరి గారి గురించి మీకు తెలియని విషయాలు.

దర్శకరత్న దాసరి గారి గురించి మీకు తెలియని విషయాలు.

Author:

దివంగత దాస‌రి నారాయ‌ణ రావు ఓ ద‌ర్శ‌కుడు, ఓ నిర్మాత‌, ఓ కథార‌చ‌యిత‌, ఓ పాటల రచయిత, నటుడు, పత్రికాధిపతి, రజకీయ నాయకుడు.. సింపుల్ గా చెప్పాలంటే ఒక బహుముక ప్రజ్ఞాశాలి. మరి ఇంత గొప్ప ప్రజ్ఞాశాలి కూడా ఒకప్పుడు స్కూల్ ఫీజు కట్టడానికి కేవలం 3 రూపాయలు లేక, నెలకు 1 రూపాయి జీతానికి వడ్రంగి షాపులో పనిచేసాడంటే నమ్మగలరా ? దటీజ్ దాసరి. ఇవాళ దర్శకరత్నగా, గిన్నిస్ రికార్డ్ సాధించిన వ్యక్తిగా, 6 సార్లు ఫిలిం ఫేర్ దక్కించుకున్న వ్యక్తిగా, ఫిలిం ఇండస్ట్రీ లో ఎవరికీ ఏ సమస్య వచ్చినా ముందుండి పేదల పక్షాన నిలిచినా సేవా తత్పరుడిగా.. ఇలా రకరకాల పాత్రలతో నిజ జీవితం లో దర్శకుడే కాదు అసలు సిసలు రియల్ హీరోగా జీవించిన దాసరి గురించే మనదరికీ తెలుసు. కానీ చిన్నతనంలో ఎదుర్కొన్న సమస్యలు, ఇబ్బందులు తేలియదు. కేవలం మూడు రూపాయ‌ల స్కూల్ ఫీజ్ క‌ట్ట‌లేక కార్పెంట‌ర్ ప‌నిలో చేరిన దాస‌రి, మెట్టు మెట్టు ఎక్కుతూ ఎవ్వరికీ అందనత ఎత్తుకూ ఎదిగి దర్శ‌క ర‌త్నగా మారిన క్ర‌మం నిజంగా ఆద‌ర్శ‌నీయం.

dasari

దాసరి గారి చిన్నతనంలో వారిది బాగా బతికినా కుటుంబమే.. సొంత ఊరైన పాల‌కొల్లులో దాస‌రి నాన్న, పెదనాన్నలతో కలిసి పొగాకు వ్యాపారం చేసేవారు. ఒకసారి దీపావళి సమయంలో పొగాకు గోడౌన్‌ మొత్తం తగలబడిపోయింది. దాంతో ఆర్థికంగా చాలా దెబ్బతిన్నారు.. ఆ కష్టకాలంలోనే పొలాలు కూడా అమ్మేయాల్సివచ్చింది. దాంతో ఇంటిల్లిపాది ఆర్ధిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. దాసరి కుటుంబంలో ఎవరూ పెద్దగా చదువుకోలేదు. కాని దాసరి వాళ్ళ నాన్న మాత్రం పిల్లలను చదివించారు. దాసరి ఆరో తరగతి కొచ్చేసరికి వారి ఆర్థిక పరిస్థితి బాగా దెబ్బతింది. స్కూలు ఫీజు మూడుంపావలా కట్టడానికి కూడా డబ్బులేక.. దాసరిని బడి మాన్పించేయాల్సి వచ్చింది. బడి మానేసిన దాసరిని ఒక వడ్రంగి దుకాణంలో పనిలో పెట్టారు. అక్కడ జీతం నెలకి రూపాయి. ఆరో తరగతిలోనే ఉత్తమవిద్యార్థిగా బహుమతి అందుకున్న దాసరి చదువు మానేసి వడ్రంగిగా పని చేయాల్సిన దుస్థితి. కానీ ఒక మాస్టారు సాయంతో మళ్ళీ చదువు కొనసాగించాడు. క్రమేనా చదువులో ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. ఇక ఆయన అనంతర ప్రతిభ ప్రపంచం మొత్తానికీ తెలిసిందే.. అందుకే కాబోలు సినిమా వాళ్ళకే కాదు ఎవ్వరికే సమస్య వచ్చినా ముందుంది తోచిన, చేయగలిగిన సాయం చేసేవాడు..

అనారోగ్యం తో నిన్న సాయంత్రం (మే ౩౦) దివంగతులైన దాసరికి అలజడి నివాళులర్పిస్తోంది ..ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిద్దాం.

(Visited 600 times, 1 visits today)