Home / Political / టైట్ జీన్స్ వేసుకునే అమ్మాయిలకు హెచ్చరిక.

టైట్ జీన్స్ వేసుకునే అమ్మాయిలకు హెచ్చరిక.

Author:

wearing jeans in Up is a Crime

ప్రపంచం ఎంతముందుకు వెళుతున్నా మనం ఇంకా కొన్ని కట్టుబాట్ల ఉచ్చులని తెంచుకోలేకపోతున్నాం. కోర్టులూ, పోలీస్ స్టేషన్లూ చట్టాల కంటే గ్రామాల్లో నిర్ణయించే పంచాయితీలే ఇంకా కొన్ని రాష్ట్రాల్లో కొత్త కొత్త స్థానిక చట్టాలతో రాజ్యమేలుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని బగ్‌పత్ గ్రామంలో కట్టుబాట్లు ఇలానే ఉన్నాయి. ఇక్కడ పంచాయితీ ఏం చెప్పిందో అదే వేదం ? పంచాయితీ తీర్పును అతిక్రమించిన వారు గ్రామ బహిష్కరణకు గురికాక తప్పదు. ఇలాంటి గ్రామాలు ఉత్తరప్రదేశ్‌లో ఒకటీ రెండు కాదు చాలానే ఉన్నాయి. బగ్‌పత్ గ్రామంలో పంచాయితీ అధికారులు అమ్మాయిల వస్త్రధారణ విషయంలో సంచలన తీర్పు ఇచ్చారు. మొన్నటికి మొన్న గుజరాత్ లోని ఒక గ్రామం పెళ్ళికాని అమ్మాయిలకు సెల్ ఫోన్ ఇస్తే గ్రామ బహిష్కరణ చేస్తాం అని హెచ్చరించిన సంగతి మర్చిపోకముందే..ఈ ఊళ్ళో మరో ఘటన అలాంటిదే జరిగింది..

ఈ మధ్య గ్రామంలోని యువతులు టైట్ క్లాత్స్, జీన్స్ ప్యాంట్లను ఎక్కువగా ధరిస్తున్నారని పంచాయితీ అధికారులకు తెలిసింది. దీంతో ఈ విషయంపై మూడు రోజుల క్రితం గ్రామ పెద్దలు పంచాయితీ నిర్వహించారు. అమ్మాయిలు జీన్స్ ప్యాంట్లను ధరించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. గ్రామంలో ఏ ఒక్క అమ్మాయి జీన్స్ వేసుకుని గానీ, టైట్ క్లాత్స్ వేసుకుని గానీ కనిపిస్తే ఆ కుటుంబం మొత్తాన్ని ఊరి నుంచి బహిష్కరిస్తామని సంచలన తీర్పు ప్రకటించారు. అయితే ఈ తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఈ తీర్పును స్వాగతిస్తుంటే, మరికొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అమ్మాయిల వ్యక్తిగత జీవితాన్ని కూడా పంచాయితీ పెద్దలు నిర్దేశించడం ఎంత వరకూ సమంజసమని ప్రశ్నిస్తున్నారు. మరి కొందరు మాత్రం పాశ్చాత్య సంస్కృతిని పారద్రోలేందుకే ఈ తీర్పును ప్రకటించినట్లు సమర్థించుకుంటున్నారు. ఈ తీర్పు తమ గ్రామంలోనే కాకుండా, ఇండియా మొత్తం అమలు జరిగితే బాగుంటుందని ఆశిస్తున్నారట. ఈ నిర్ణయాలను ఏ ఒక్కరు కాదన్నా గ్రామ బహిష్కరణ తప్పదని పంచాయితీ పెద్దలు హెచ్చరించారు.

(Visited 1,510 times, 1 visits today)