Home / Inspiring Stories / తాత భాదను తీర్చడానికి కొత్త ఆవిష్కరణ చేసిన మనవడు.

తాత భాదను తీర్చడానికి కొత్త ఆవిష్కరణ చేసిన మనవడు.

Author:

నొప్పి అయిన, భాధ అయిన అనుభవించేవాడికే తెలుస్తుంది అంటారు మన పెద్దలు. మానవ శరీరంలో ఏ ఒక్క అవయవ లోపం ఉన్న మనషి మనిషిగా బ్రతక లేడు. అందులో వినికిడిలోపం అనేది ఎంత నరకమో అది అనుభవించేవారికే తెలుసు. ప్రతి వెయ్యి మందిలో నలుగురు వినికిడిలోపం సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇందులో కొంత మంది కొన్ని పరిక్షలు చేయించుకొని మందులు వాడి కానీ, ఆపరేషన్ కానీ చేస్తే తిరిగి వినగలరు. కానీ వారి ఆర్థిక సమస్యల వల్ల చాలామంది వెనుకడుగు వేస్తారు. అలాగే ముసలివారికి వయసు అవుతున్నకొద్ది వారికి చెవులు వినిపించవు అలాంటి వారికి ఇప్పుడు వినికిడిలోపంతో ఎదురయ్యే సమస్యలను ప్రత్యక్షంగా చూసి ఆలోచనలో పడ్డ ఓ కుర్రాడు రెండేళ్లు శ్రమించి తక్కువ ఖర్చుతో ఓ కొత్త పరికరాన్ని తయారుచేశాడు. అతడే ముకుంద్‌ వెంకటక్రిష్ణన్‌.

us-indian-invented-cheaper-hearing-aid

ముకుంద్‌ వెంకటక్రిష్ణన్‌ ఉండేది అమెరికాలోని లూయిస్ విల్లే సిటీలో, అయిన ఇతనికి ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అంటారా!. ముకుంద్‌ ఉండేది అమెరికా అయిన, వారి తాత గారిది మన దేశమే. ముకుంద్‌ చివరి సారి ఇండియాకు వచ్చినప్పుడు వారి తాత వినికిడి లోపంతో చాలా భాధపడుతుండటం చూశాడు, వినికిడి పరికరం అమర్చినా కూడా ఫలితం లేకపోయింది. దానీతో ఎలాగైన దీనికి ఒక పరిష్కారం కనిపెట్టాలని నిర్చహించుకొని తక్కువ ఖర్చుతో ఇప్పుడు ఉన్న పరికరాల కన్నా బాగా పనిచేసే   నాణ్యమైన హియరింగ్‌ ఎయిడ్‌ను ముకుంద్‌ తయారుచేశాడు. దీని ధర కేవలం 60 డాలర్ల(సుమారు 4 వేల రూపాయలు). కంప్యూటర్‌ చిప్‌లాగా కనిపించే ఈ పరికరానికి సాధారణ హెడ్‌ఫోన్స్‌తో ఉపయోగించుకోవచ్చని చెప్పాడు. వినికిడి లోపం ఏ స్థాయిలో ఉందో గమనించి ఆమేరకు సౌండ్‌ను పెంచి వినిపించడం దీని ప్రత్యేకత. ఈ హియరింగ్‌ ఎయిడ్‌ మిషన్‌ను జెఫర్‌సన్‌ కౌంటీ పబ్లిక్‌ స్కూల్స్‌ ఐడియా ఫెస్ట్‌లో ముకుంద్‌ ప్రదర్శించాడు దానితో ముకుంద్ కు కెంటకీ స్టేట్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ ఫెయిర్‌లో మొదటి భాహుమతి వరించింది. ఈ హియరింగ్‌ ఎయిడ్‌ మిషన్‌ను ఈ సారి ఇండియాకు వచ్చినప్పుడు స్వయంగా తన చేతులతో తన తాతగారికి ఇవ్వనున్నాడు ముకుంద్.

(Visited 545 times, 1 visits today)