Home / Inspiring Stories / ఇస్రో విజయాలకి భయపడి, దెబ్బతీయాలని చూస్తున్న అమెరిక శాటిలైట్ సంస్థలు.

ఇస్రో విజయాలకి భయపడి, దెబ్బతీయాలని చూస్తున్న అమెరిక శాటిలైట్ సంస్థలు.

Author:

ISRO India

దేశాల సాంకేతిక పరిజ్ఞాన సామర్థ్యానికి, అంతర్జాతీయ వేదికలపై గౌరవానికి ప్రతీకలవుతున్నాయి. చిత్రమేమిటంటే.. నిన్నమొన్నటి వరకూ ఈ పోరులో పేరుపడ్డ అమెరికా, రష్యాలు కొంచెం వెనుకపడిపోగా భారత్, చైనా లాంటి కొత్త దేశాలు అగ్రరాజ్యాలకు సవాల్ విసురుతుండటం! అమెరికా ప్రస్తుతం శాటిలైట్లను ఇస్రో ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెడుతోంది. అయితే ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన కొన్ని రాకెట్ లాంఛింగ్ సంస్థలు అమెరికా శాటిలైట్లను ఇండియన్ ఇస్రో ద్వారా ప్రయోగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి. అమెరికాకు చెందిన శాటిలైట్లను ఇస్రో ద్వారా ప్రయోగిస్తుండటంతో అమెరికాలోని రాకెట్ లాంఛింగ్ సంస్థలు అవకాశాలు కోల్పోతున్నాయి. ఈ తరుణంలో భష్యత్తులో వాటి పరిస్థితి మరింత దారుణమయ్యే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. అందుకోసం అమెరికాలోని ప్రాంతీయ రాకెట్ లాంచింగ్ సంస్థలు అమెరికా ప్రభుత్వం మీద దీని గురించి తీవ్ర ఒత్తిడిని తీసుకువస్తున్నాయి..ఇస్రో మీద అనవసర ఆరోపణలు చేస్తూ ఎలా అయినా తమ మార్కెట్ ని పెంచుకోవాలన్న తపనతో ఇస్రో మీద మండిపడుతున్నాయి.. ఇంతకూ ఇంత మండిపాటూ ఎందుకంటే….

గత ఏడాది సెప్టెంబర్‌లో అమెరికాకు చెందిన నాలుగు శాటిలైట్లను ఇస్రో పిఎస్‌ఎల్‌వీ రాకెట్ ద్వారా ప్రయోగించింది. ఇది విజయవంతమైన తరువాత ఇప్పుడు మరిన్ని అమెరికన్ శాటిలైట్లు ఇస్రో సేవలను వినియోగించుకోవడానికి వరుసలో ఉన్నాయి. ప్రస్తుతం ఏరో స్పేస్ రంగంలో అమెరికా మరియు రష్యా దేశాల మధ్య ఎప్పటి నుంచో తీవ్రమైన పోటి ఉంది. అయితే అమెరికా తమ ఏరో స్పేస్ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి భారత్‌తో చేతులు కలిపింది. అయితే ఈ రెండు దేశాల పోటిని తట్టుకుని ఇండియా రాకెట్‌లను ఎంతో విజయవంతంగా ప్రయోగిస్తోంది. అంతరిక్ష ప్రయోగాల విషయంలో భారత్, మన పొరుగు దేశం చైనాలది లేట్ ఎంట్రీనే. కానీ ఇటీవలి కాలంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గత ఏడాది నవంబర్ 5న మార్స్ పైకి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మార్స్ ఆర్బిటర్ మిషన్‌ను విజయవంతంగా ప్రయోగించింది.

Isro Nasa

అంతే కాదు దాదాపు 20 ఏళ్లుగా కొరకరాని కొయ్యలా మిగిలిన క్రయోజెనిక్ ఇంజిన్ టెక్నాలజీ మిస్టరీలను ఛేదించిన భారత్ అదే ఊపుతో జీఎస్‌ఎల్వీ ప్రయోగాన్ని సక్సెస్ చేసి అగ్రరాజ్యాల సరసన నిలిచింది. ఈ విజయమిచ్చిన ఉత్సాహంతో మరో మూడేళ్లలో చంద్రయాన్-2 ద్వారా చంద్రుడిపైకి లాండర్‌ను, రోవర్‌ను కూడా పంపించాలని ఇస్రో నిర్ణయించింది.

ISRO GSLV

అమెరికా శాటిలైట్లను ఇండియన్ ఇస్రో ద్వారా ప్రయోగిస్తే అమెరికాలోని రాకెట్ లాంచింగ్ సంస్థలకు తీవ్ర స్థాయిలో నష్ట వాటిల్లుతోందని మరియు అవకాశాలు కూడా కోల్పోతున్నామని అమెరికా సంస్థలు అమెరికా ప్రభుత్వం మీద ఈ ఒప్పందాన్న రద్దు చేయాలని తీవ్ర ఒత్తిడిని తీసుకువస్తున్నాయి.

Must Read: గూగుల్ మ్యాప్స్ ని మించిన నావిగేషన్ సిస్టంని తయారుచేసిన ఇస్రో.

(Visited 1,465 times, 1 visits today)