Home / health / బట్ట తల, తెల్ల జుట్టు, జుట్టు రాలడం వంటి సమస్యలను ఉల్లితో తగ్గించుకోండి.

బట్ట తల, తెల్ల జుట్టు, జుట్టు రాలడం వంటి సమస్యలను ఉల్లితో తగ్గించుకోండి.

Author:

పెరుగుతున్న కాలుష్యం వలన ఈ రోజుల్లో చాలా మంది ఫేస్ చేస్తున్న పెద్ద ఇబ్బంది వెంట్రుకలు రాలిపోవడం లేదా బట్ట తలగా మారిపోవడం. ఒక వైపు జాబ్ స్ట్రెస్ మరో వైపు విపరీతమైన కాలుష్యం ..దీంతో మన తల మీద ఉన్న కొద్దీ పాటి జుట్టు కాస్తా రాలిపోవడమో, ఊడిపోవడమో లేదా తెల్లగా మారడమో జరుగుతుంది. ఇది మన అందాన్ని దెబ్బతీయడమే కాకుండా కాన్ఫిడెన్స్ ని కూడా తగ్గిస్తుంది. ఇక అబ్బాయిలైనా, అమ్మాయిలకైనా ఈ సమస్య కామన్. ఐతే ఇదేం పెద్ద సమస్య కాదని, జస్ట్ కొన్ని చిట్కాలు పాటిస్తే మీ జుట్టు మళ్ళీ నిగనిగలాడుతూ బారుగా పెరుగుతుందని చెబుతున్నారు కేశ నిపుణులు. అసలవన్నీ కాదు మీ వంటింట్లోనే దీనికి సరైన విరుగుడు ఉంది. మన బామ్మలు పాటించి ప్రూవ్ చేసిన చిట్కా ఇది.. అదే తల్లి లాంటి ఉల్లి. ఉల్లిని వంటల్లో వాడి రుచిని ఎంజాయ్ చేయడమే కాదు, దాని జూస్ ని హెయిర్ ప్యాక్ లాగా వాడితే తెల్ల జుట్టు నెమ్మదిగా నలుపుగా మారడమే కాకుండా, రాలిన లేదా ఊడిన చోట కూడా జుట్టు తిరిగి పెరుగుతుందట. ఇది ఇప్పుడు డాక్టర్స్ కూడా చెప్తున్నారు.

onion solution for hair problems

ఉల్లి పాయ తరుగుతుంటే మనకు కళ్ళలోంచి నీళ్లొస్తయ్..ఎందుకంటే ఉల్లి లో సల్ఫర్ ఉంటుంది కాబట్టి. ఈ సల్ఫర్ జుట్టు పెరుగుదలకు కావాల్సిన కెరోటిన్ అనే ప్రోటీన్స్ పెరగడానికి ఉపయోగపడుతుంది. ఉల్లి లో ఉండే చాలా విటమిన్స్, మినరల్స్ మన ఆరోగ్యానికే కాదు జుట్టుకి కూడా చాలా ఎఫెక్టివ్ గా ఉపయోగపడతాయి. ఫోలిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్, కెరోటిన్, పొటాషియం, ఫాస్పరస్, జింక్ లు సమృద్ధిగా ఉండడమే కాకుండా, ఉల్లి జ్యూస్ లో విటమిన్ బీ, సి, ఈ లు ఉండడం దానిని వాళ్ళ కేశ సంవర్ధినిగా పిలవొచ్చు. ఉల్లి రసం తో చేసిన ప్యాక్ వాళ్ళ తెల్ల జుట్టు కూడా ముందు గ్రే గా మారి నిదానంగా నలుపు రంగులోకి వచేస్తాయట.

ఇక ఇదే విషయమై ఈ మధ్య కొంతమందిపై అమెరికాలో చేసిన పరిశోధనల్లో 4 వారాల్లో 75 శాతం, 6 వారాల్లో దాదాపు 85 శాతం ఇంప్రూవ్మెంట్ కనబడింది. జుట్టు రాలడం, బట్ట తల, చుండ్రు, వెంట్రుకలు చివర్లో బ్రేక్ అవడం వంటి అన్ని సమస్యలకు ఈ ఒక్క ఉల్లి జూస్ ప్యాక్ తో చెక్ పెట్టొచ్చని డాక్టర్స్ కూడా బల్ల గుద్ది మరియు చెబుతున్నారు. ఉల్లి పాయలు పాయలుగా ఉంటుంది..మన జుట్టుని కూడా పాయలు పాయలుగా పెంచుతుందని హామీ ఇస్తున్నారు డర్మటాలజిస్టులు . ఇక హెర్బల్ ప్యాకులు, ఇంకేవో రకరకాల ప్యాకులు వాడడం కన్నా జస్ట్ ఉల్లి జూస్ ప్యాక్ వాడి మన జుట్టు ను మనం కాపాడుకుందాం.

(Visited 2,106 times, 1 visits today)