Home / Inspiring Stories / స్మార్ట్ ఫోన్ తో దోమలని చంపేయండి.

స్మార్ట్ ఫోన్ తో దోమలని చంపేయండి.

Author:

mosquito repellent

దోమ దాదాపు 60 రకాల వ్యాదులని వ్యాపింప జేసే ఒకే ఒక వాహకం. మిల్లీ మీటర్ సైజుకు మించని ఈ చిన్న ప్రాణి ప్రపంచాన్నే వణికించే విపత్తులలో ఒకటి. మస్కిటో కాయిల్స్,దోమలను దగ్గరికి రానివ్వని క్రీం లూ ఎన్ని వాడటం మన ఆరోగ్యాన్నీ ఎంతో కొంత పాడుచేస్తూనే ఉన్నయి. ఐతే ఇప్పుడు మరో కొత్త మార్గం వచ్చింది. దానికోసం కావల్సిందేమిటో తెలుసా..? మీ చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ ఔను మీ స్మార్ట్ ఫోన్ తోనే దోమలని తరమొచ్చు…

స్మార్ట్ఫోన్లో తమ యాప్ ఒక్కటి ఇన్స్టాల్ చేసుకుని, దాన్ని ఆన్ చేస్తే చాలు ‘మస్కిటో రిపెల్లెంట్’ అనే ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుని, మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. దాన్ని ఆన్ చేయగానే ఒక రకమైన ఫ్రీక్వెన్సీతో అది శబ్దాలను విడుదల చేస్తుంది. ఆ శబ్దం భరించలేక దోమలు ఎక్కడివక్కడే పారిపోతాయి. ఈ యాప్ కేవలం ఇలా దోమలను తరిమి కొట్టడమే కాదు.. అందులో ఉన్న ‘ఎం ట్రాకర్’ అనే ఫీచర్తో మీ ఇంట్లో ఎన్ని దోమలు ఉన్నాయి, అవి ఎక్కడెక్కడ ఎక్కువగా ఉన్నాయనే విషయాన్ని కూడా తెలియజెబుతుంది. ఈ యాప్ విడుదల చేసే శబ్దాలు కుక్క ఈలల కంటే కొంచెం ఎక్కువగా మాత్రమే ఉంటాయని, అందువల్ల మనుషులకు ఇబ్బందికరంగా అనిపించదని చెబుతున్నారు. పైగా, మన ప్రాంతానికి అనువుగా ఉండేలా ఫ్రీక్వెన్సీని కూడా మార్చుకోవచ్చు. దీనికి బ్యాటరీ కూడా పెద్దగా ఏమీ ఖర్చుకాదట.ఈ యాప్ కేవలం ఇలా దోమలను తరిమి కొట్టడమే కాదు.. అందులో ఉన్న ‘ఎం ట్రాకర్’ అనే ఫీచర్ తో మీ ఇంట్లో ఎన్ని దోమలు ఉన్నాయి, అవి ఎక్కడెక్కడ ఎక్కువగా ఉన్నాయనే విషయాన్ని కూడా తెలియజెబుతుంది.

అల్ట్రా సౌండ్ టెక్నాలజీ కారణంగా వచ్చే ఓ రకమైన సన్నటి ధ్వని కారణంగా దోమలు గది నుంచి బయటకు వెళ్లిపోతాయి. ఈ శబ్దం పడక గదిలో నిద్రించే వారికి వినిపించదు. కేవలం దోమలకు మాత్రమే తెలుస్తుంది.20కిలోహెర్డ్జ్ లోపు ఉన్న శబ్దాలను మనం వినలేం కానీ దోమలకి మాత్రం ఈ ఫ్రీక్వెంచీ శబ్దం ఇరిటేషన్ కలిగిస్తుంది ఈ ఆప్ ని ఆన్ చేయగానే వచ్చే శబ్దం మీకు ఇబ్బందనిపించదు కానీ దోమలు మాత్రం మీ చుట్టుపక్కలకు రావట. ఒక సారి ఈ యాప్ ట్రై చేసి చూడండి మరి

(Visited 300 times, 1 visits today)