Home / health / దంపుడు బియ్యం తినండి… మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి

దంపుడు బియ్యం తినండి… మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి

Author:

మన తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా తినే ఆహారం అన్నం. ఎందుకంటే మన ప్రాంతాలలో ఎక్కువగా వరి పండిస్తారు కాబట్టి, వెనుకటి రోజుల నుండి అన్నమే మన ప్రధాన ఆహారంగా వాడుతున్నాం. కాని, మన తాతలు, నాన్నలు ఉన్నంత బలంగా మాత్రం మనం ఉండటం లేదు. దానికి కారణం మనం తీసుకునే ఆహారం. వారు వెనుకటి రోజులలో వడ్లని దంచి బియ్యన్ని వండుకునే వారు, అలాగే బియ్యం నుండి వచ్చే గంజి కూడా తాగేవారు. ఎందుకంటే  బియ్యం నుండి వచ్చే పోషాకాలు గంజిలో ఉంటాయి కాబట్టి, అందుకే వారు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. కాని ఇప్పుడు ఎక్కడ చూసిన రసాయన ఎరువులతో పంటలు పండిస్తుంటే  తినేవారికి కొత్త రోగాలు వస్తున్నాయి. అందులో ముఖ్యంగా బియ్యం(రైస్) విషయంలో మాత్రం చాలా మంది దంపుడు బియ్యం (భ్రౌన్ రైస్) కోసం చూస్తున్నారు . ఈ బియ్యం గోధుమ రంగులో చూడటానికి ఉన్న మనకు చాలా ఉపయోగపడుతుంది.ఈ బియ్యం ఎందుకు మంచిదో  ఒక్కసారి చూద్దాం.

uses-of-brown-rice

  • పీచు సమృద్ధిగా ఉన్నందున జీర్ణవ్యవస్థకు బ్రౌన్ రైస్ ఎంతో ప్రయోజనకారి. ఇది ప్రేగులలో ఆరోగ్యకర కదలికలను ప్రోత్సహించి మలబద్దకాన్ని నివారిస్తుంది.
  • ఈ బియ్యంలో ఉండే ఫైటోన్యూట్రిఎంట్ లిగ్నాస్ రొమ్ము క్యాన్సర్, గుండెజబ్బులను అడ్డుకోవడంలో సహాయపడుతుంది. వయసు మళ్ళిన మహిళలపై జరిపిన అధ్యయనంలో బ్రౌన్ రైస్ వంటి ధాన్యాహారాన్ని తినడం వలన ఎంటరోలాక్టోన్ స్థాయిని పెంచుతుందని తెలుస్తుంది.
  • బ్రౌన్ రైస్ ఊకలో లభ్యమయ్యే నూనె కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. దీనిలో ఉండే పీచు కూడా ఎల్ డి ఎల్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.దీనిలో ఉండే పీచు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రింస్తుంది.
  • గోధుమరంగు బియ్యంలో ఉన్న సెలీనియం పెద్ద ప్రేగుకు క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. బియ్యంలో పెద్ద మొత్తంలో ఉన్న పీచు జీర్ణవాహికలో క్యాన్సర్ కారక రసాయనాలను బయటకు పంపుతుంది.
  • శరీర బరువును సాధారణంగా ఉంచుతుంది. బ్రౌన్ రైస్ లో పీచు సమృద్ధిగా ఉన్నందున మీరు అదనపు క్యాలరీలు తీసుకోకుండా చూడటమేకాక ఎక్కువసేపు నిండుగా ఉన్నట్లుగా అనిపించేట్టుగా చేసి ఎక్కువగా తినే అవకాశాలను తగ్గిస్తుంది. హార్వర్డ్ పరిశోధకుల అధ్యయనాలలో తేలిందేమిటంటే పీచు ఎక్కువగా ఉండే బియ్యం తినే మహిళల శరీర బరువు దాదాపుగా సాధారణంగా ఉంటుంది.
  • ఒక కప్పు బ్రౌన్ రైస్ లో దాదాపు 21% మెగ్నీషియం దొరుకుతుంది. మెగ్నీషియం ఎముకల ఆరోగ్యానికి, వేరొక అత్యవసర పోషకం కాల్షియం గ్రహించడానికి కూడా అవసరం.
  •  టెంపుల్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు బ్రౌన్ రైస్ తింటే రక్తపోటును తగ్గించటంతో పాటుగా ధమనుల్లో ఫలకం చేరే స్థాయి తగ్గి, గుండె జబ్బులు వృద్ది చెందకుండా కాపాడవచ్చని కనుగొన్నారు.
  • అనేక అధ్యయనాలలో తేలిందేమిటంటే బ్రౌన్ రైస్ లోని మెగ్నీషియం ఉబ్బసంతో బాధపడే వారిలో దాని తీవ్రతను తగ్గిస్తుంది.బ్రౌన్ రైస్ లోని సెలీనియం కూడా ఉబ్బసానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది.

(Visited 2,673 times, 1 visits today)