Home / health / ఒక్క కప్పు గ్రీన్ టీ తో రోజంతా అలసట దూరం.

ఒక్క కప్పు గ్రీన్ టీ తో రోజంతా అలసట దూరం.

Author:

మాములుగా ఉదయం లేవగానే ఘుమఘుమలాడే టీ లేదా కాఫీ నోట్లో పడకపోతే చాల చిరాకు పడతరు కొంతమంది. అయితే ఇదంతా గతం.. ఇప్పుడంతా గ్రీన్ టీ ట్రెండ్ నడుస్తుంది, ఇది తాగితే ఆరోగ్యంతో పాటు శరీర బరువు తగ్గి మొహం నిగనిగలాడుతుంది. యంగ్ గా కనిపిస్తామనే భావనతో గ్రీన్ టీ చాలా మంది రోజువారీ ఆహరం లో భాగం అయిపోయింది . వెయిట్ ని కంట్రోల్ లో పెట్టుకోవాలన్న, రోజంతా రిలాక్స్డ్ గా ఉండాలన్న…ఆ రోజు గ్రీన్ టీ తో స్టార్ట్ అవ్వాల్సిందే. గ్రీన్ టీ లో యాంటీఆక్సిడాంట్స్ శాతం ఎక్కువ. ఇది మన రక్తప్రసరణని అధికం చేస్తుంది అలాగే జీర్ణ వ్యవస్థ ని వేగ వంతం చేస్తుంది. మామూలు టీ కి బదులుగా గ్రీన్ టీ ని అలవాటుగా చేసుకోవటం వల్ల బరువు పెరగకుండా ఉంటాం ఎందుకంటే గ్రీన్ టీ లో మామూల్ప్ప్ టీ లో వేసే పాలు, చక్కెర వేయం కాబట్టి. అంతే కాకుండా కాన్సర్ రాకుండా కూడా గ్రీన్ టీ ఉపయోగపడుతుంది. నిజానికి గ్రీన్ టీ మన సాధారణ టీపొడి మాదిరి కాదు. కామేల్లియా సైనెన్సిస్ అనే జాతికి చెందిన ఈ మొక్క నుంచి గ్రీన్ టీ పొడి తయారవుతుంది. ఆ మొక్క ఆకులు ముదిరి రంగుకు మారుతున్నా దశలో వాటిపై పరదాలు కప్పి తరువాత ఎండపెడతారు. ఇలా నాచురల్ గా తయారవడం గ్రీన్ టీ ప్రత్యేకత.

benefits of green tea

సాధరణ టీ లో మనం పాలు ఇంకా చక్కర కలపడం వలన బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి. అందుకని టీ కి బదులుగా గ్రీన్ టీ ని వాడుక లోకి తెచ్చుకున్నాం. గ్రీన్ టీ లో చాల విలువైన పోషకాలు ఉంటాయి. యాంటీఆక్సిడాంట్స్ తో పాటుగా విటమిన్ ఏ బి సి లు మరియు చఫ్ఫిఎనె కూడా ఉంటాయి. అయితే బరువు పెరగకుండా దోహదపడుతుంది కదా అని రోజు కి రెండు సార్ల కు మించి తాగ కూడదు. చఫ్ఫిఎనె ఉండటం వలన దీన్ని ఎక్కువ సార్లు తాగితే బీపీ, గుండె వేగంగా కొట్టుకోవటం లాంటి సమస్యలు రావచ్చు. అందుకని గ్రీన్ టీ ని రెండు సార్ల కు మించి తాగకూడదు. డయాబెటిస్ ఉన్నవారు, అధిక బరువు ఉన్నవారికి మాత్రం గ్రీన్ టీ చాలా లాభదాయకం. కానీ చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, బీపీ ఉన్నవారు గ్రీన్ టీ కి దూరంగా ఉండటం మంచిది. ఇక మన శరీరంలోని మలినాలను శుభ్ర పర్చడం లో కూడా గ్రీన్ టీ సమర్ధవంతంగా పనిచేస్తుంది.

(Visited 453 times, 1 visits today)