Home / Inspiring Stories / ఆధ్యాత్మిక పరంగా గోరింటాకు సౌభాగ్యానికి ప్రతీక

ఆధ్యాత్మిక పరంగా గోరింటాకు సౌభాగ్యానికి ప్రతీక

Author:

mehandi uses

భారతదేశం ఆయుర్వేదానికి పుట్టినిల్లు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మనకు తెలియకుండా మన సంప్రదాయంలో కొన్ని చిట్కాలు కలసిపోతాయి అలాంటి వాటిలో గోరింటాకు ఒక్కటి. గోరింటాకు మన భారతదేశంలో ఎక్కువగా వాడుతారు. ఇప్పుడు దినీ గురించి ఎందుకంటే ఇప్పుడు పెళ్ళిల సీజన్ కాబట్టి. గోరింటాకు ఎక్కువగా పెండ్లిలలో మరియి శుభకార్యాల సమయాలలో ఎక్కువగా వాడుతుంటారు మన ఆడపడుచులు. అలంకారానికి వాడే గోరింటాకు వలన మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. గోరింటాకు ఒంట్లో ఉన్న వేడిని చాలా తగ్గిస్తుంది. ఈ కారణంగానే పెళ్ళిల సమయంలో వధూవరులకు గోరింటాకు ను పెడుతారు. గోరింటాకులో చర్మానికి మేలు చేసే లాసొన్, మ్యూసిలీ, గ్యాలిక్ ఆసిడ్ వంటి రసాయనాలు ఉంటాయి. చేతులకు కాళ్లకు పెట్టుకుంటే చల్లదనాన్ని ఇస్తుంది. దీనిలోని పదార్థాలు కాలి వేళ్లు, గోళ్లు శుభ్రంగా ఉంచడానికి గోళ్లు పుచ్చకుండా సహాయపడతాయి. అంతేకాకుండా గోరింటాకు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. గోరింటాకు పొడవైన, మృదువైన, మరియు అందమైన జుట్టుని పొందడానికి ఎంతో ఉపయోగపడుతుంది. సహజమైన గోరింటాకులతో పాటు టీ ఆకులు , పెరుగు , నిమ్మరసం , మరియు ఉసిరికాయ రసం వంటి ఇతర పదార్ధాలను కలిపి ఉపయోగిస్తే మంచి సత్ఫలితాలు పొందవచ్చు. ఆధ్యాత్మిక పరంగా గోరింటాకు సౌభాగ్యానికి ప్రతీక అని.. మహిళలు గోరింటాకు పెట్టుకోవడం ద్వారా సౌభాగ్యాన్ని పొందిన వారవుతారని జ్యోతిష్యులు అంటున్నారు.

(Visited 1,910 times, 1 visits today)