Home / health / సీజనల్ ఫ్రూట్ సీతాఫలం ఒక సంజీవని అంటున్న డాక్టర్స్.

సీజనల్ ఫ్రూట్ సీతాఫలం ఒక సంజీవని అంటున్న డాక్టర్స్.

Author:

మనకు ప్రకృతి పరంగా లభించే పండ్లలో సీతాఫలం ఒకటి. ఈ పండు ఈ సమయంలో మాత్రమే లభిస్తుంది. కొన్ని పండ్లు కేలరీలు ఇస్తాయి అలాగే మాంసకృత్తులని ఇస్తాయి కానీ సీతాఫలం మనం తినే ఆహార పదార్థంగా మారి పైరెండింటిని ఇచ్చి ఆరోగ్యాన్ని ఇస్తుంది. సీతాఫలం ఆకు మొదలుకొని గింజల వరకు అన్నీ ఉపయోగపడుతాయి. సీతాఫలం మనకు రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా శరీరానికి శక్తిని ఇచ్చి దీర్ఘకాలిక వ్యాధులను నశింప చేస్తుంది.

uses-of-seethaphalam

  • ఈ పండులో ఉండే మెగ్నీషియం మన శరీరంలోని అన్ని కండరాలకు మంచి ఉపశమనం కలిగిస్తూ గుండె జబ్బులు రాకుండా చేస్తుంది.
  • ఈ పండులో ఉండే విటమిన్ -ఏ కళ్లకు, జట్టుతో పాటు చర్మానికి కూడా ఆరోగ్యాన్ని ఇస్తుంది.
  • సీతాఫలాన్ని ఎక్కువగా తినడం వలన రక్త హీనత తగ్గుతుంది. కడుపులో మంట, జీర్ణ సమస్యలు ఉన్నవారు అలాగే డైటింగ్ చేసే వారు క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చు.
  • ఈ పండు పేగులో పేరుకుపోయే నులిపురుగులను నివారిస్తుంది.
  • సీతాఫలం అల్సర్ ఉన్నవారికి చక్కటి మందులాగా పనిచేసి మంట నుండి మంచి ఉపసమనం కలిగిస్తుంది.
  • పండులోని సల్ఫర్ చర్మవ్యాధులను తగ్గించి చర్మ కాంతివంతంగా చేస్తుంది.
  • ఎండిన గింజలను మెత్తగా పొడిచేసి ప్రతిరోజూ సాంపు లాగా వాడుకోవచ్చు.
  • ఇంట్లో ఉండే పిల్లలకు రోజుకు ఒకటి అయినా తినిపిస్తే పండులో ఉండే పాస్పరస్, కాల్షియం,ఇనుము లాంటి పోషకాలు ఎముకలను దృడంగా చేస్తాయి.
  • బాలింతలకు, బలహీనంగా ఉన్నవారికి పండులోని గుజ్జునుని తేనేతో కలిపినిస్తే వారికి అధిక శక్తిని చేరుతుంది.
  • పండులోని గుజ్జును పాలతో కలిపి తాగితే శరీరంలోని వేడి, దాహం ఎక్కువగా ఉన్న తగ్గుతుంది. జ్వరం వచ్చినప్పుడు నాలుక రుచిగా ఉందని సమయంలో ఈ పండును ఇస్తే నాలుకకు రుచి దొరుకుతుంది.
  • ఆస్తమా, షుగర్ ఉన్నవారు ఈ పండును తినకూడదు ఎందుకంటే మాగిన పండులో గ్లూకోజ్ ఎక్కువగా ఉంటుంది అలాగే లివర్, మూత్రపిండాల వ్యాధితో ఇబ్బంది పడే వారు ఈ పండును తీసుకోకపోవడమే మంచింది. పచ్చి కాయలను కాల్చుకొని తినవచ్చు.
(Visited 5,197 times, 1 visits today)