Home / Inspiring Stories / బిత్తిరి సత్తి ఎంపీ అయితే సావిత్రి పీ ఏ అయితదాట

బిత్తిరి సత్తి ఎంపీ అయితే సావిత్రి పీ ఏ అయితదాట

Author:

మన సత్తి ఎంపీ అయితడంట వరంగల్ ఎలక్షన్లల్ల నిలవడనీకి టికట్ కోసం టీ ఆర్ ఎస్ ఆఫీస్ కాడ ముఖ్యమంత్రి సాబ్ ని కలిశి మాట్లాడ్తడాట. సారు డిల్లికి పోయి రాంగనే టికట్ కొనుక్కుంటడాట. రాజకీయాల గురించి మన సత్తికేం తెల్సు అనుకుంటున్నరా… ఏ ఆల్ల సర్పంచి కాడ అన్ని నేర్సుకున్నడాట 4 లచ్చలుంటే సాలు నేనే ఎంపీ అంటుండు మల్ల.గిదేం కతరో తమ్మీ అని ఆల్లక్క మొత్తుకుంటనే ఉన్నది గనీ సత్తి మాత్రం గట్టిగనే కూసున్నడు కాదు కాదు నిలవడ్డడు (కూసుంటే పార్టీల కెల్లి జంపు జేసుడు కష్టమైతదాట ) టీ ఆరెస్ ల కాకుటే కాగ్రేస్ ల టికట్ తెచ్చుకుంటడాట …. ఇగ నేనే వరంగల్ MP అని పిక్సయ్యిండు సావిత్రికి PA జాబ్ గూడ పక్క జేశిండు. గిదేం కతనో ఏమో ఐనా ఇప్పుడున్న లీడర్ల కంటే మన సత్తి అసోంటోల్లే మంచిదేమో సూద్దాం….సత్తీ నా ఓటు మాత్రం నీకే పో… !

(Visited 82 times, 1 visits today)