Home / Devotional / వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారంలో దేవుణ్ణి దర్శిస్తే.. ఏం జరుగుతుందంటే..?!

వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారంలో దేవుణ్ణి దర్శిస్తే.. ఏం జరుగుతుందంటే..?!

Author:

ధనుర్మాసంలో వచ్చే వైకుంఠ ఏకాదశిని హిందువులు ఎంతో ప్రవిత్రమైన రోజు, ముఖ్యంగా శ్రీమహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన రోజుగా భక్తులు భావిస్తారు, ధనుర్మాసంలో వచ్చే శుక్ల పక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని అంటారు, సాధారణంగా ప్రతి సంవత్సరంలో 24 ఏకాదశులు ఉంటాయి, వీటిలో వైకుంఠ ఏకాదశిని అత్యంత పవిత్రమైనది భక్తులు భావిస్తారు, ఎందుకంటే మిగతా ఏకాదశులు చంద్రమానం ప్రకారం గణిస్తే వాటికి భిన్నంగా సౌరమానం ప్రకారం దీన్ని గణిస్తారు. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అని అంటారు.

వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశని, స్వర్గద్వార ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ పేర్లు రావడం వెనుక వేర్వేరు కథనాలు పురాణాల్లో కనిపిస్తాయి. విష్ణువు కొలువై ఉన్న వైకుంఠ ద్వారాలు ఈరోజు తెరుస్తారని వైకుంఠ ఏకాదశి అంటారు. దక్షిణాయణంలో యోగనిద్రలోకి వెళ్లిన మహావిష్ణువు ఈ రోజునే మేల్కొన్న స్వామిని దర్శించుకోవడానికి ముక్కోటి దేవతలూ వైకుంఠానికి చేరుకుంటారు. అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. దక్షిణాయణంలో చనిపోయిన పుణ్యాత్ములకు ఈ రోజునే స్వర్గంలోకి ప్రవేశించే అవకాశం కల్పిస్తారు కాబట్టి స్వర్గద్వార ఏకాదశి అని అంటరాని పురాణాల్లో ఉంది.

వైకుంఠ ఏకాదశి

ఇక కృతయుగంలో ముర అనే రాక్షసుడు దేవతలను, రుషులను క్రూరంగా హింసించేవాడు. ముర అక్రమాలను భరించలేక దేవతలు శ్రీహరికి తమ బాధలు చెప్పుకున్నారు. ఆ నారాయణుడు మురాసురుడి వధించడానికి బయల్దేరతాడు. ఈ విషయం తెలిసిన మురాసురుడు సాగర గర్భంలోకి వెళ్లి దాక్కుంటాడు. దీంతో అతన్ని బయటికి రప్పించేందుకు ఉపాయం పన్నిన నారాయణుడు గుహలోకి వెళ్లి నిద్రపోతున్నట్లు నటిస్తాడు. ఇదే అదనుగా భావించిన మురాసురుడు గుహలోకి ఉత్తర ద్వారం గుండా వచ్చి, మహా విష్ణువును వధించేందుకు కత్తి దూయగానే ఒక శక్తి ఉద్భవించి మురాసురుణ్ణి సంహరిస్తుంది. ఈ విధంగా దేవతలను సంరక్షించిన ఆ శక్తికే ఏకాదశి అని నామకరణం చేశారు, ఈరోజు ఉత్తర ద్వారం గుండా భక్తులకి ఆ శ్రీమహావిష్ణువు దర్శనం ఇస్తాడని భక్తుల నమ్ముకం.

మాములుగా అన్ని దేవాలయాల్లో ఏడాదిలో అన్ని రోజులు ఉత్తర ద్వారాన్ని మూసే ఉంచుతారు, కేవలం వైకుంఠ ఏకాదశి రోజే ఉత్తర ద్వారాన్ని తెరిచి ఉంచుతారు, తిరుపతిలో కూడా వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం గుండా స్వామి దర్శనం కోసం భక్తులు ఆర్థరాత్రి నుండి లైన్ లలో నిలబడి వేచిచుస్తుంటారు, ఈరోజు ఉత్తర ద్వారం గుండా స్వామిని దర్శించుకున్న వారి సకల సౌభాగ్యాలు లభిస్తాయని భక్తుల నమ్మకం.

(Visited 412 times, 1 visits today)