Home / Entertainment / వర్మ‘వీరప్పన్’ అసలు రూపం.

వర్మ‘వీరప్పన్’ అసలు రూపం.

Author:

రామ్ గోపాల్ వర్మ సినిమాలంటే అభిమానులలో ఎంతటి క్రేజ్ ఉంటుందో మనందరికి తెలుసు. తన సినిమాలలో ఎంతో వైవిధ్యాన్ని చూపించే వర్మ తాజాగా కిల్లింగ్ వీరప్పన్ సినిమాను తెరకెక్కించారు. ఒక వైపు రొమాంటిక్ మరో వైపు హరర్ , ఇంకో వైపు రియల్ స్టోరీ నేపధ్యంతో ఎన్నో సినిమాలను తెరకెక్కించాడు.నిజ జీవిత సంఘటనలతోనూ వ్యక్తులపైనా కరెంట్ ఎఫైర్స్ తో తీసిన సినిమాలు హిట్టే. అయితే నిజ జీవిత సంఘటనలతో సినిమాలు తీసేటప్పుడు చాలా సవాళ్లు ఎదురవుతుంటాయి. అందరికీ తెలిసిన పాత్రలే తెరపై కనిపిస్తుంటాయి. ఆ పాత్రలకి తగ్గ నటుల్ని ఎంపిక చేసుకోవడం చాలా కష్టం. రక్తచరిత్ర సీక్వెల్స్ తీసేటప్పుడు వర్మ పరిటాల – సూరి పాత్రల కోసం ఎవర్ని ఎంపిక చేసుకొంటాడా అని జనాలు ఆసక్తికరంగా చూశారు. కాని వర్మ వివేక్ ఒబెరాయ్ – సూర్య లాంటి నటుల్ని ఎంపిక చేసుకొని తన టేస్ట్ ఎలా ఉంటుందో మరోసారి చాటి చెప్పాడు.

Killing Veerappan Movie Review

కిల్లింగ్ వీరప్పన్ చిత్రం జనవరి 1న విడుదల కానుండగా వర్మ తాజగా తన ట్విట్టర్‌లో ఒక ఫోటోను పోస్ట్ చేసారు. ఈ చిత్రం స్మగ్లింగ్ కిల్లర్ వీరప్పన్ జీవిత నేపధ్యంతో తెరకెక్కించగా ఈ చిత్రంలో వీరప్పన్ పాత్రను సందీప్ భరద్వాజ్ పోషించారు. అయితే ఈ సినిమాలో సందీప్ అచ్చం వీరప్పన్ లుక్‌తోనే ఉండగా ఈ పాత్రకు సందీప్‌ను ఎంపిక చేయడం వర్మ దృష్టి ఎలాంటిదో చెప్పుకోవచ్చు. వర్మ పోస్ట్ చేసిన ఫోటోలో సందీప్ భరద్వాజ్ మేకప్‌కు ముందు మేకప్ తర్వాత చాలా ఢిఫరెంట్‌గా ఉండగా ఆ క్రెడిట్ అంతా గ్రేట్ మేకప్ ఆర్టిస్ట్ విక్రమ్ గైక్వాడ్‌దేనని వర్మ తెలిపారు.. ఇతనా తెరపై కనిపించే వీరప్పన్ అని ముక్కున వేలేసుకొంటున్నారు. కానీ వర్మ మాత్రం ఈ నటుడు వీరప్పన్ పాత్రకి సరిపోతాడని సందీప్ భరద్వాజ్ ని చూసిన రెండు నిమిషాల్లోనే ఎంపిక చేసేశాడట. వర్మ సిక్స్త్ సెన్స్ అంతలా పనిచేస్తుంటుందని ఆయనతో పనిచేసిన టెక్నీషియన్లు చెబుతున్నారు.

(Visited 112 times, 1 visits today)