Home / Entertainment / వరుణ్ తో రాయబారి చేయిస్తున్న క్రిష్.

వరుణ్ తో రాయబారి చేయిస్తున్న క్రిష్.

Author:

Krish-and-Varun-Tej-Rayabhari-movie

వైవిధ్యమే ప్రాణంగా సాగుతున్న దర్శకుడు క్రిష్…. తాజా చిత్రం ‘కంచె’లోనూ అదే తీరున సాగారు. నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న క్రిష్ కు విషెస్ చెబుతూ ఆయన బాణీని గుర్తు చేసుకుందాం…తొలి సినిమాతోనే ప్రతిభను చాటుకున్న అరుదైన దర్శకుల చెంత ‘గమ్యం’తోనే చేరిపోయాడు క్రిష్. జాగర్లమూడి రాధాకృష్ణ కాస్తా సినిమాపిచ్చితో క్రిష్‌గా మారిపోయాడు. అతనిలోని తపనను గుర్తించిన తండ్రి సాయిబాబు తానే నిర్మాతగా మారి ‘గమ్యం’ చిత్రాన్ని నిర్మించారు. మొట్టమొదటి చిత్రం ‘గమ్యం’తోనే క్రిష్ ప్రేక్షకుల్లో గుర్తింపు సంపాదించాడు. ‘గమ్యం’లో క్రిష్ ఎంచుకున్న కథ, దానిని నడిపించిన తీరు జనాన్ని బాగా ఆకట్టుకుంది. తొలి సినిమాతోనే ఉత్తమ దర్శకుడిగా నందిని అందుకున్న క్రిష్ మలి చిత్రం ‘వేదం’లోనూ వైవిధ్యం ప్రదర్శించాడు… ఈ సినిమా సైతం క్రిష్‌కు అవార్డులూ, రివార్డులూ సంపాదించి పెట్టింది…, మెగా ఫ్యామిలీ నుంచి రీసెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన హీరో వరుణ్ తేజ్‌ల కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘కంచె’ ఇటు విమర్శకుల ప్రశంసలను, బాక్సాఫీస్ కలెక్షన్లనూ వసూలు చేసి మంచి హిట్ సాధించిన విషయం తెలిసిందే. ఇండియన్ సినిమాలో మొదటిసారి రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కిన మొదటి సినిమాగా వార్ జానర్‌లో రూపొందిన ఈ సినిమా క్రిష్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక తమ కాంబినేషన్‌లో మొదటి సినిమాయే మంచి ప్రయోగం చేసిన క్రిష్, వరుణ్‌లు తాజాగా మరో సినిమా కోసం జతకట్టనున్నారు.

మెగా ఫ్యామిలీ నుండి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ తాజాగా వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఈ ఏడాది రెండు సినిమాలలో నటించిన వరుణ్ వచ్చే ఏడాది మరిన్ని ప్రాజెక్టులతో మస్త్ ఎంటర్‌టైన్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాదిలో కంచె, లోఫర్ చిత్రాలు చేఆడు వరుణ్ వచ్చే ఏడాది మొదట్లో నే తన సినిమాను మొదలు పెట్టనున్నారట.

లోఫర్‌తో మాస్ పాత్రలోనూ మెప్పించగలనని నిరూపించిన వరుణ్, తన తదుపరి సినిమాను క్రిష్‌తో చేసేందుకు సిద్ధమయ్యారు. ఇక ఈ సినిమా తెలుగు సినిమాలో ఎప్పుడో కానీ రాని స్పై థ్రిల్లర్ జానర్లో రూపొందనున్నట్లు తెలుస్తోంది.‘రాయబారి’ అన్న టైటిల్‌తో తెరకెక్కనుందన్న ప్రచారం.

(Visited 100 times, 1 visits today)