Home / Entertainment / ‘రాయబారి’గా వరుణ్ తేజ్.

‘రాయబారి’గా వరుణ్ తేజ్.

Author:

Krish And Varun Tej Next Movie Rayabari Details

హీరోయిజానికి ప్రాధాన్యం ఇవ్వకుండా కేవలం కథా బలాన్నే నమ్ముకొని సినిమా తీస్తున్న దర్శకుడు క్రిష్ (జాగర్లమూడి రాధాకృష్ణ). తొలి సినిమా నుంచే తన మార్క్ చూపిస్తూ వస్తున్న ఈ క్రియేటివ్ డైరెక్టర్ కంచె సినిమాతో కమర్షియల్గా కూడా ఆకట్టుకున్నాడు. వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన పీరియాడిక్ డ్రామా కంచె మంచి కలెక్షన్లు సాధించటంతో పాటు దర్శకుడిగా క్రిష్ స్థాయిని కూడా మరో మెట్టు పైకి చేర్చింది.

ప్రస్తుతం అదే జోష్లో మరో సినిమాకు కథా కథనాలు రెడీ చేసే పనిలో ఉన్న క్రిష్, ఓ ఆసక్తికరమైన టైటిల్ను రిజిస్టర్ చేయించాడు. అచ్చమైన తెలుగు టైటిళ్లతో ఆకట్టుకునే క్రిష్ మరోసారి అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ‘రాయబారి’ అనే టైటిల్‌ను ఫిలిం ఛాంబర్లో రిజిస్టర్ చేయించాడు.‘కంచె’ చిత్రంతో మంచి విజయాన్ని అందున్నారు హీరో వరుణ్ తేజ, దర్శకుడు క్రిష్. ఇద్దరు మరోసారి కలిసి పని చేయబోతున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సీక్రెట్ ఏజెంటుగా కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమలో వరుణ్ తేజ్ లుక్ కూడా గత సినిమాలకు భిన్నంగా ఉంటుందని అంటున్నారు. ఓ సీక్రెట్ మిషన్ కోసం వరుణ్ తేజ్ ఏజెంటుగా పని చేస్తాడని అంటున్నారు. రొమాంటిక్, యాక్షన్ ఎంటర్టెనర్ గా తెరకెక్కించేందుకు దర్శకుడు క్రిష్ సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. జనవరిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. రాజీవ్ రెడ్డి, సాయిబాబా జాగర్లమూడి సంయుక్తంగా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టెన్మెంట్స్ బేనర్లో ఈ సినిమాను నిర్మించబోతున్నారట. మినా మిస్ ఇండియా 2013 రన్నరప్ దిషా పతాని ఈ చిత్రంలో వరుణ్ తేజ్ కి జోడీగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ చివరి వారంలో విడుదల చేయాలని దర్శక, నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు

(Visited 90 times, 1 visits today)