Home / Entertainment / లోఫర్ చాలా మంచి అబ్బాయి.

లోఫర్ చాలా మంచి అబ్బాయి.

Author:

Loafer Audio Release

వరుణ్ తేజ్ మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన మరొ హీరో కాని, వరుణ్ మొదటి సినిమా నుండే సినిమాలా ఎంపిక చాలా జగ్రత్తగా ఎంచుకుంటు వస్తున్నాడు.మోదటి సినిమా ముకుంద ,కంచె ,ఇప్పుడు దర్శకుడు పూరీ జగన్నాథ్‌ లోఫర్ పేరుతో ఓ మాస్ ఎంటర్‌టైనర్‌ను సిద్ధం చేసిన విషయం తెలిసిందే. మదర్ సెంటిమెంట్‌ను హైలైట్ చేసుకొని తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 18న విడుదలకు సిద్ధమవుతోంది. ఇక ఈ సాయంత్రం ఈ సినిమాకు సంబంధించిన ఆడియో ఆవిష్కరణ వేడుకను హైద్రాబాద్‌లోని శిల్పకళావేదికలో నిర్వహించారు. ఈ వేడుకకు ‘లోఫర్’ యూనిట్‌తో పాటు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఇక ఈ వేడుకలో ఆడియోను ఆవిష్కరించిన ప్రభాస్, కొద్దిసేపు మాట్లాడారు. వరుణ్ తేజ్‌లో మంచి ఈజ్ ఉందని, భవిష్యత్‌లో వాళ్ళ బాబాయ్(పవన్ కళ్యాణ్) అంత పెద్ద స్టార్ అవుతాడని అన్నారు. ఇక పూరీ జగన్నాథ్‌తో పనిచేస్తే ఎవ్వరైనా స్టార్ అయిపోవచ్చని, ఆయనలా క్యారెక్టరైజేషన్‌ను బేస్ చేసుకొని సినిమా కథ రాయగల దర్శకుడు దేశంలోనే లేరని ఈ సందర్భంగా అన్నారు. వరుణ్ తేజ్ సరసన దిశా పటాని హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు సునీల్ కశ్యప్ సంగీతం సమకూర్చగా సి.కళ్యాణ్ సినిమాను నిర్మించారు.

(Visited 84 times, 1 visits today)