Home / Entertainment / ‘ఫీల్ మై లవ్’ అంటున్న మెగా హీరో వరుణ్.

‘ఫీల్ మై లవ్’ అంటున్న మెగా హీరో వరుణ్.

Author:

Varun Tej

ముకుంద, కంచె సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మెగా మెగా వారసుడు వరుణ్ తేజ్, ఆ తరువాత లోఫర్ సినిమాతో కమర్షియల్ ఇమేజ్ కోసం ప్రయత్నించినా అది వర్క్ అవుట్ కాలేదు. కంచె లాంటి ఒక వైవిధ్యమైన కథతో మంచి హిట్ ఇచ్చిన క్రిష్ దర్శకత్వంలో రాయబారి పేరుతో థ్రిల్లర్ సినిమా చేయాలని భావించినా, ప్రస్తుతానికి ఆ ఆలోచనను వరుణ్ పక్కన పెట్టేశాడు. కమర్షియల్ స్టార్గా గుర్తింపు తెచ్చుకోవటం కోసం లవ్ స్టోరి తో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు.దిల్ రాజు సినిమాలకు స్క్రిప్ట్ రైటింగ్ టీమ్‌లో వర్క్ చేసిన వెంకీ అట్లూరి త్వరలో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.

వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఫీల్ మై లవ్ పేరుతో లవ్ స్టోరి ప్లాన్ చేస్తున్నాడు దిల్ రాజు. ఈ సినిమాలో వరుణ్ హీరోగా పైనల్ అయిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకు ‘ఫీల్‌ మై లవ్‌’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు రాజు గారు. ఒక మంచి ప్రేమ కథతో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. టైటిల్‌ ప్రకటించడంతోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకంతో చిత్ర నిర్మాత దిల్‌రాజు ఉన్నాడు.

(Visited 154 times, 1 visits today)