Home / Entertainment / వెండి తెర పై మెరిసిన వెన్నెల “రేఖ”.

వెండి తెర పై మెరిసిన వెన్నెల “రేఖ”.

Author:

జుస్తజూ జిస్ కీ థీ ఉస్ కొ తొ నా పాయా హం నే

ఇస్ బహానె సె మగర్ దెఖ్ లీ దునియా హం నే….

ఒక్కో రాత్రి అలా గడిచిపోతుంది ఒక జీవితాన్ని స్వప్నించినట్టూ,పుట్టుకనీ,మరణాన్నీ ఒకేసారి ముని వేళ్ళతో స్పర్శించినట్టూ.. జీవితపు మూలల్లో ఒక విశాద రేఖ మనసుకి అడ్డంగా గీయబడినట్టూ అలా…ఒక పాటగా,ఒక మార్మిక రాగంగా ఆరాత్రి అలా గడిచి పోతుంది.కొన్ని సార్లు ఏదో విశాదాన్ని కలుపుకొన్న విస్కీ గొంతులోకి జారొచ్చు లేదా బుగ్గలపై కన్నీళ్ళూ జారొచ్చు కొన్ని రేఖలని చిత్రించనూ వచ్చు…. అప్పుడు మీ కళ్ళ ముందు కదిలే ఒక రూపం రేఖదీ కావొచ్చు లేదా అమీరన్ అవొచ్చు….

ఇన్న్ ఆంఖొ కీ మస్తీ కె మస్తానె హజారొ హైన్

ఇన్న్ ఆంఖొ సె వాబస్త

ఇన్న్ ఆంఖొ సె వాబస్త అఫ్సానె హజారొ హైన్….

వేలాది హృదయాలని కదిలించిన రూపం, కథా రెండూ రేఖా నే…   ఇవాళ రేఖ పుట్టిన రోజు, ఇండియన్ సినిమా సెల్యులాడ్ పై మెరిసిన ఒక చిరునవ్వు కోసం కొన్ని అక్షరాలు…

అంతులేని విషాదం లా కాగిపోయీ నిశ్శబ్దంగా కొన్ని సమయాల్లో కరిగిపోయీ రేఖని వెతుక్కుంటాం లోపల దాగున్న ఒక ఆహిర్ భైరవి రాగాన్ని ఉమ్రావ్ జాన్ తో కలిపి అనుభూతిస్తాం అద్బుతమైన అందం ఉన్న నల్లని మొహంలో దాచిన విషాదాన్ని మాత్రం ఎందరు గుర్తించి ఉంటారు…? “దక్షిణాది మొహం నీది, నల్లగా ఉంటావ్” అన్న గొంతులే గుమ్మం ముందు చూసినప్పుడు నవ్వుకున్న రేఖ లాగే ఒక నిర్లిప్త నవ్వుని ఎన్ని సార్లు నవ్వుకొని ఉంటాం…

కాదల్ మన్నన్ (శృంగార చక్రవర్తి) జెమినీ గణేషన్ కుమార్తె కానీ… ఆమె తల్లి పుష్పవళ్ళి జెమినీ గణేషన్ కి భార్య కాదు…., ఒక చిన్నారి మనసుని భాదతో నింపేందుకు ఇంకే కారణం కావాలి? తను ఎదిగినా తండ్రి మీద ఇంకా కోపంగానే ఉన్నాను అని చెప్పేంత ద్వేషం ఆ అందమైన గుండెని ఎంత చిద్రం చేస్తూ ఉండి ఉంటుంది… ప్రేమని పొందటం ఎందుకో రేఖ కి ఎప్పుడూ కుదరలేదు….

రేఖ మొదటి సినిమా బాల నటిగా బేబీ భానురేఖ గా తెలుగు చిత్రం “రంగుల రాట్నం” అప్పటికి రేఖ కి తెలిసి ఉండదు కొన్ని సింబాలిక్ సంఘటనలెలా ఉంటాయో అచ్చం ఆ సినిమా టైటిల్ లాగానే రేఖ జీవితమూ ఎలా తిరిగిందో..ఒక్కొక్క బందమూ రేఖనుంచి దూరంగా కదులుతూ రేఖా ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ… ఒక్కో పాత్రా ఒకో చాలెంజ్ 1978 ఘర్ సినిమా విడుదలైంది  సామూహిక అత్యాచారంతో తీవ్రంగా బాధించబడి. ప్రేమించే భర్త మూలంగా తిరిగి బలాన్ని పుంజుకొనే కొత్తగా పెళ్ళయిన యువతి ఆర్తి రేఖ లో ఉన్న నటనా విస్వరూపాని చుపించిన చిత్రం కళ్లలో పలికించే విశాదం, ధైర్యం జీవితపు రెండే రెండు ముఖ్యమైన తీవ్ర భావోద్వేగాలు… రేఖ కి నిజంగా నటించాల్సిన అవసరం రాలేదేమొ ఒక సారి పడి లేచిన తర్వాత కెరటానికి పడి లేవటం అలవాటైపోతుంది.,ఈ సినిమాకి ఫిలిం ఫేర్ అవార్డ్ అందుకుంది.

హర్ ధడకన్ మేన్ ప్యాస్ హై తేరీ, సాన్సొన్ మైన్ తెరీ ఖుష్బూ హై

ఇస్ ధరతీ సె ఉస్ అంబర్ తక్, మెరీ నజర్ మైన్ తూ హీ తూ హై

ఫ్యార్ యె టూటే నా, తూ ముజ్ సే రూఠే నా

సాథ్ యె చూటె, కభీ నా   

ఎన్ని మాటలెన్నిఊసులెన్ని ఊహలు అమితాబ్ రేఖా ఏ సూపర్ హిట్ ప్రేమకథ కూ తీసిపోని ఒక జంట కథ మరేమైందో….! సప్నోంకీ శీషా టూటే కైసే… రేఖా…! ఒక ప్యాసీ శ్యాం..

అమితాబ్ ప్రేమ ఒక అందమైన మరక గానే మిగిలిపోయింది..అన్ని మరకలూ మంచివేకాక పోవచ్చు.. ఐతే రేఖకి ముందే తెలుసేమో ప్రపంచానికి రేఖ ఒకతేనని అందుకే ఒంటరైనా పెద్దగా బాధ పడలేదు కనీసం భాదని బయటికి చూపించనూ లేదు కూలీ సినిమా సమయం లో మాత్రం అంతాబ్ కి ఆక్సిడెంట్ అయితే ఒక్కతే గుడికి వెళ్ళి వేడుకుంది ఏమని…? సందేహం లేదు రేఖ లాగే ఆమె మనసూ అందమైందే అమితాబ్ కోలుకున్నాడు.. “కల్ అగర్ నా రొషనీ కె కాఫిలే హుయే ప్యార్ కే హజార్ దీప్ హైన్ జలే హుయే…!”

కహిన్ దూర్, కహిన్ దూర్ ముఝె జానా హై కహిన్ దూర్

కోయి మేరే సాత్ చలే న చలే

ముఝే కోయి సాతీ మిలే నా మిలే నా

ఫర్ జాన హై జరూర్ హ ..!

ఎక్కడా ఆగలేదు రేఖ ఎక్కడా ఆగిపోలేదు రేఖ సిని ఆకాశం లో రేఖ అలా సాగిపోయింది..  రేఖ జీవితం లో బచ్చన్ తరువాతి శకం ఆమెకు వృత్తిలో కొత్త గుర్తింపునిచ్చింది.,ఆమె తన వృత్తి జీవితాన్ని ప్రొఫెషనల్ గా మార్చుకున్న సమయం కూడా ఇదే. కలియుగ్, బసేరా, ఏక్ హి భూల్ ఒక్కో సినిమాలో ఒక్కొక్క పాత్ర ఒక డ్యూఎట్ ఐపోయిందనిపించి రెండు సార్లు మత్తుగా నవ్వే పాత్రలు కావు. జీవితపు లోతుల భారాన్ని చూపించాల్సిన పాత్రలు..అన్ని పాత్రలకీ ఒకే సమాధానం రేఖ.

1990 నుంచీ ఈ చందమామ కొద్దిగా మసకబారింది  ఐనా రేఖ తనకు వయసు పెరుగుతోందని ఒప్పుకోలేదు,ఆమె తరంలోని నటీమణులయిన హేమ మాలిని మరియు రాఖీ వారి చిత్రములలో తల్లి లేదా అత్త వంటి సహాయక పాత్రలను పోషించటం మొదలుపెట్టినప్పటికీ, రేఖ వారికి విరుద్ధంగా మాధురి దీక్షిత్ మరియు రవీనా టాండన్ వంటి నటీమణులు ఉన్నత దశలో ఉన్న సమయంలో కూడా, ప్రధాన పాత్రలను పోషించింది.

మీరా నాయర్ ఒక సినిమా తీయాలనుకొని రేఖని సంప్రదించారు పాత్ర పేరు “రసాదేవి” సినిమా కామ సూత్ర: ఏ టేల్ ఆఫ్ లవ్ . సాంప్రదాయ వాదులూ,రేఖా అభిమానులూ గుండెలు బాదుకున్నారు,ఋఏఖ ఇలాంటి సినిమా చేస్తుందా..!? అని ముక్కున వేలేసుకున్నారు. సినిమా విడుదలైంది జనాల ముక్కుమీది వేలు అలాగే ఉంది రేఖ మాత్రం ఫిలిం ఫేర్ అవార్డ్ ని అందుకొని ఎప్పటిలానే నవ్వుకుంది… జనాన్ని చూసి కాదు చుట్టూ విమర్శలలోంచే వచ్చే విజయాలని చూసి….!

కోయి … మిల్ గయా”…!? రేఖ కీ వయసు మీదపడింది హృతిక్ రోషన్ కి తల్లి లా మారింది…రెండేళ్ళ తరువాత  అదే హృతిక్ కి నాయనమ్మ గా కూడా మారింది ఐతే..! రేఖ నటన మారిందేమో రేఖ మారదు ఎందుకంటే రేఖ 18 ఏళ్ళకే అరవయ్యేళ్ళ జీవితం లో దెభ్భలని చూసింది వయసు తో పాటూ శరీరం ఎదుగుతుందేమో రేఖ ఎప్పుడో ఎదిగిపోయింది….

రేఖ ఇప్పుడూ అలాగే ఉంటుంది ఎప్పుడో ఒక సాయంత్రం మీ ఇంటి వెనక పూలచెట్ల మధ్య తిరుగుతున్నప్పుడు ఒక పువ్వు దేఖ ఏక్ క్వాబ్ తో యె సిల్ సిలే హుయే,దూర్ తక్ నిగాహో మేన్ హై ఫుల్ ఖిలే హుయే… అంటూ సిగ్గు పడుతూ ఒక రూపం కళ్ళముందు కదులుతుంది  చాందిని నా..!? రేఖ నా..!? ఒక డైలమా కి సమాధానం దొరకదు…

మరో నిశ్శబ్ద సాయంత్రం అస్తమిస్తున్న సూర్యున్ని చూస్తూ కూచున్నప్పుడు ఝబ్ భీ మిల్తీ హై ముఝే అజ్ నబి లగతీ క్యొన్ హై, జిందగీ రోజ్ నయె రంగ్ బదలతీ క్యొన్ హై..!? అంటూ అమాయకంగా అడుగుతుందో కంఠం ఎవరదీ అమిరనా..!? రేఖా నా..!? ప్రశ్నకి సమాధానం ఇచ్చే లోపే ఒక పాట మిమ్మల్ని తాకుతుంది

ఇష్క్ వాలొన్ సే నా పూచ్హో కి

ఉన్ కి రాత్ కా ఆలం తనహా కైసే గుజరతా హై

జుదా హో హమసఫర్ జిస్ కా, వొ ఉస్ కో యాద్ కరతా హై

న హో జిసకా కొఇ వొ మిలనె కి ఫరియాద్ కరతా హై…..!

ఆ విషాదానందాన్ని ఇచ్చేదెవరూ…!? రేఖా..!? జోహ్రా భాయి..!? బహుశా ఆ పాట పాడే గొంతు మీదేనేమో ఒక సారి చూసుకోండి….

(Visited 161 times, 1 visits today)