Home / Entertainment / ‘బాబు బంగారం’ లుక్ కొత్తగా ఉంది

‘బాబు బంగారం’ లుక్ కొత్తగా ఉంది

Author:

తులసి సినిమా తర్వాత విక్టరీ వెంకటేష్-నయనతార హీరో-హీరోయిన్లుగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో వస్తోన్న చిత్రం ‘బాబు బంగారం’ కొత్త లుక్ రిలీజైంది. ఈ పోస్టర్ చాలా కలర్ ఫుల్ గా ఉంది. వెంకటేష్, నయనతార మంచి జోడి గా కనిపిస్తున్నారు. ఇదివరకు వీరు నటించిన తులసి ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనకు తెలిసిందే. ఈ సినిమా పై అంచానాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దానికి కారణం హీరో- హీరోయిన్లు ఇది వరకు నటించిన చిత్రం పెద్ద హిట్ అవడం మరియు ఈ చిత్ర దర్శకుడు తన ముందు సినిమాలు అన్ని మంచి సక్సెస్ సాదించడం.

venky babu bangaram teaser on june6th

ఇక ఈ మూవీ టీజర్ 6వ తేదీన విడుదల చేస్తున్నట్లు డైరెక్టర్ మారుతి సోషల్ మీడియా ద్వారా తెలిపారు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో వస్తోన్న ఈ సినిమాకి సూర్యదేవర నాగవంశి, పిడిపి ప్రసాద్ నిర్మాతలు. మూవీని జూలైలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సినిమాకు గిబ్రన్ మ్యూజిక్ ను అందిస్తున్నారు.

(Visited 226 times, 1 visits today)