Home / Entertainment / మరో రీమేక్ చిత్రం పై మోజుపడుతున్న వెంకి.

మరో రీమేక్ చిత్రం పై మోజుపడుతున్న వెంకి.

Author:

Venkatesh

విక్టరీ వెంకటేష్ తెలుగు ప్రేక్షకులకు వినోదం కోసం ఎలాంటి రిస్క్ అయిన చేసి మరి సినిమాలు చేస్తుంటాడు. ఎ భాషా సినిమా అయిన అర్దవంతమైన మరియు అలారించే సినిమా ఉంటే దానినీ రీమేక్ చేసి మన తెలుగు ప్రజలను ఆనందింప చేస్తాడు. తన నత జీవితంలో చాలా సినిమాలు రీమేక్ రూపంలో ఉన్నవి. ఇప్పుడు తాజాగా మరో రీమేక్ సినిమా పై కన్నేశాడు. తమిళ హిందీ బాషలలో మాధవన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా ‘సాల కడూస్’ చిత్రం ఈ నెల 29 న విడుదల కానుంది.బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో మాధవన్ కోచ్ గా’ రితికా సింగ్ బాక్సర్ గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని విడుదలకు ముందే చుసిన వెంకటేష్ కి ఈ చిత్రం బాగా నచ్చడంతో తెలుగులో రీమేక్ చేయడానికి మనసు పడ్డాడట.అనుకున్నదే తడువుగా తెలుగు రీమేక్ రైట్స్ తీసుకొనే ప్రయత్నంలో ఉన్నాడట. అలాగే తమిళ్, హిందీకి దర్శకత్వం వహించిన మణిరత్నం శిష్యుడు కొంగర సుధ ప్రసాద్ నే తెలుగులో కూడా దర్శకుడిగా తీసుకోవాలి అనే ఆలోచనలో ఉన్నారు. ఈ చిత్రం తర్వాత ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ ఫేమ్ క్రాంతి మాధవ్ తో ఓ చిత్రం చేయనున్నాడు.

(Visited 148 times, 1 visits today)