Home / Entertainment / సాటి నిర్మాతల కష్టాల గురించి ఎరిగిన హీరో- వెంకి

సాటి నిర్మాతల కష్టాల గురించి ఎరిగిన హీరో- వెంకి

Author:

Venkatesh Photos

టాలీవుడ్ అంటేనే నాకంటే ఎవరూ ఎక్కువ కాదు. నేను నేనే… అనే తత్వం నడిపిస్తుంటుంది. ఈగోల గోల వ్యక్తిత్వాన్ని ఈగో డామినేట్ చేసేస్తుంది ఇక్కడ. ఇలాంటి పరిశ్రమలో వాటన్నిటికీ దూరంగా అగ్రనిర్మాత రామానాయుడు కొడుకుగ టాలీవుడ్ సినిమా రంగంలో అడుగు పెట్టి గర్వం లేని హీరోగా విక్టరీ వెంకటేష్ పేరు తెచ్చుకున్నారు. సాటి నిర్మాతల కష్టాల గురించి ఎరిగిన హీరోగా వారి కష్ట సుఖాల్లో సాయం చేసిన హీరోగా పేరు తెచ్చుకున్నారాయన. ఒకసారి తనతో స్నేహం చేస్తే అతడిని విడిచి వెళ్లలేనంత గొప్ప సాన్నిహిత్యం దొరుకుతుందని అతడితో పనిచేసిన దర్శకనిర్మాతలు చెబుతుంటారు. మొహం చాటేసుకుని వెళ్లిపోయే తత్వం తనది కాదని చెబుతారు. అంతేనా .. హీరోలు మహేష్ – పవన్ కల్యాణ్ లతో ఎంతో సన్నిహితంగా ఉండే హీరో వెంకటేష్ – మహేష్ తో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు – పవన్ తో గోపాల గోపాల చిత్రాల్లో నటించాడు. ఒక స్టార్ హీరో అయి ఉండీ ఎలాంటి ఈగోలకు పోకుండా ఇతర హీరోలతో కలిసి నటించిన విలక్షణ వ్యక్తిత్వం అతడిది. ఎదుటివారికి గౌరవం ఇచ్చి పలకరించడం అందరినీ తనవారిగా భావించే కలుపుగోలుతనం విక్టరీ వెంకటేష్ ని స్సెషల్ హీరోగా నిలబెట్టింది. ఇతరుల విషయాల్లో వేలు పెట్టడు – అనవసర విషయాల్లో తల దూర్చడు. తన పనేంటో తనదే. అణకువ ఉన్న హీరోగా వెంకీకి గుర్తింపు ఉంది.
వెంకి అందరు హీరోలా మాదిరి ఎవ్వరితో గోడువ పడే మనస్థత్వం కాదు. డబ్బున్న ఇంటి నుండి వచ్చిన గర్వం ఇసుమంత అయిన కనిపించదు. వెంకి కి స్వామీ వివేకానంద అంటే చాలా అభిమానం. తను రజినికాంత్ మళ్ళే హిమాలయాలకు వెళ్ళి వస్తుంటాడు. ఎందుకు హిమాలయాలకు వెలుతున్నారు అంటే వెంకి చెప్పే సమాధానం మానసిక ప్రశాంతత కోసం అంటాడు. టాలీవుడ్ లో వెంకి చేసిన వెరైటి పాత్రలు తన తోటి హీరోలు ఎవ్వరు చేయ్యలేదు.

అంతేనా .. ఒక లేడీ డైరెక్టర్ కి ఛాన్సిచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రేర్ ఫీట్ వెంకీ కెరీర్ లోనే సాధ్యమైంది. సీనియర్ నటి దర్శకురాలు శ్రీప్రియకు దర్శకురాలిగా చాన్సిచ్చి దృశ్యం సినిమాలో నటిస్తున్నప్పుడు ఎన్నో విమర్శల్ని ఎదుర్కొన్నాడు వెంకీ. అసలు లేడీ డైరెక్టర్ తో ఈయనగారి సినిమా ఏంటో? అని పెదవి విరిచేసిన వారే.. ఆ సినిమా చూసి అరే గొప్పగా తీసిందే అని పొగిడేశారు. ఆ డేర్ ఫీట్ వెంకీ వల్లనే సాధ్యమైంది. ఇలా చెప్పుకుంటే ఈగోయిస్టిక్ వరల్డ్ లో ఈగోలేని మహారాజుగా వెంకీ గురించి చెప్పుకోవచ్చు. ఇందులో కించిత్ అతిశయోక్తి కూడా లేదు.

(Visited 121 times, 1 visits today)