Home / General / Video: లండన్ లో విజయ్ మాల్యా ను దొంగా అని పిలిచిన భారత అభిమానులు

Video: లండన్ లో విజయ్ మాల్యా ను దొంగా అని పిలిచిన భారత అభిమానులు

Author:

విజయ్ మాల్యా.. ఒకప్పుడు కింగ్ ఫిషర్ అధినేతగా.. విలాసల్లకు కేరాఫ్ అడ్రస్ గా ఒక విజయవంతమైన వ్యాపారవేత్తగా అందరి చేత భేష్ అనిపించుకున్నాడు. మరి ఇప్పుడో.. ఆ లిక్కర్ కింగుని చూస్తేనే అందరికీ అసహ్యం. వేల కోట్ల రూపాయిలను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన దొంగ.. అవును నిజంగా దొంగే. అందుకే ఒక భారతీయ యువకుడు మాల్యా కనపడగానే చుక్కలు చూపించాడు. పబ్లిక్ లో దొంగా ..దొంగా అని పిలిచి ఇబ్బందుల్లో పడేసాడు.

Vijay Mallya booed outside the Oval

ఇప్పటికే ప్రజల సొమ్ముని ఎగ్గొట్టి విదేశాల్లో దర్జాగా బతుకుతున్న మాల్యాని భారత్ రాప్పించేoదుకు మన ప్రభుత్వం ప్రయత్నిస్తున్నప్పటికీ మాల్యా మాత్రం దర్జాగా క్రికెట్ మ్యాచులకు కూడా వెళ్తున్నారు. ఐసీసీ క్రికెట్ మ్యాచుల లైవ్ లో కూడా దర్శనమిస్తున్నాడు. సోషల్ మీడియాలో పిచ్చి ట్వీట్లు కూడా చేస్తున్నాడు. మన ప్రబుత్వం ఏం చేయలేకపోతున్నప్పటికీ.. ఒక సామాన్యుడికి మాత్రం దొరలా ఫోజు కొడుతున్న మాల్యాని చూడగానే చిర్రెత్తుకొచ్చింది. అందుకే క్రికెట్ స్టేడియం లోకి దర్జాగా అడుగుపెట్టిన మాల్యాని.. హే చూడండి.. దొంగ.. దొంగ వస్తున్నాడు అని అరిచి ఇబ్బంది పెట్టాడు ఒక యంగ్ ఇండియన్. ఒక్కసారిగా ఊహించని రీతిలో జరిగిన ఈ పరాభావ౦ మాల్యాకు తీవ్ర ఇబ్బందినయితే కలిగించింది. కానీ, అసలే వేల కోట్లు ఎగ్గొట్టి క్రికెట్ ఎంజాయ్ చేస్తున్నాడు… ఈ మాటలను పట్టించుకుంటాడా?

ఇంగ్లాండ్ లోని ఓవల్ ఎరీనాలో భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ కు స్టైల్ గా వచ్చాడు విజయ్ మాల్యా. తన వెంట ఒక స్నేహితుడు కూడా ఉన్నారు. మాల్యా లోపలికి రాగానే ఒకతను ఫోన్ తో వీడియో తీయటం మొదలు పెట్టాడు. కానీ మరో సామాన్యుడు అలియాస్ భారతీయుడు మాత్రం మాల్యా పై మాటల తూటాలు పేల్చాడు. చూడండి.. దొంగ వచ్చేస్తున్నాడు., ఈ దొంగ స్టేడియంలోకి అడుగు పెడుతున్నాడంటూ పెద్దగా అరవటం మొదలు పెట్టాడు. ఈ షాకింగ్ పంచులకు బిత్తరపోయాడు మాల్యా. కానీ, వెంటనే తేరుకుని ఏం పట్టనట్టు వెళ్ళిపోయాడు. మాల్యా పట్టించుకున్నాడో లేదో తెలీదు కానీ.. ఈ పద్ధతేదో బాగున్నట్టుందే అనుకుంటున్నారు చాల మంది నెటిజన్లు. మాల్యా ఎక్కడ కనిపించినా.. దొంగ.. దొంగ అంటూ అరిస్తే సరిపోతుందేమో. కొంచమైనా సిగ్గుపడి దెబ్బకు ఆయన గారు దిగి వస్తారేమో అని బావిస్తున్నారు. కానీ వేలకు వేల కోట్లు ఎగ్గొట్టి క్రికెట్ మ్యాచులని ఎంజాయ్ చేస్తున్న అయ్యగారికి.. ఈ మాటలు వినబడతాయా ?

(Visited 396 times, 1 visits today)