ఫేస్ బుక్ మానియా దేవుళ్ళనూ తాకింది. ఫేస్ బుక్ లో దేవుడి పేరున అక్కౌంట్లు ఓపెన్ చేసి తమ తమ భక్తినీ పిచ్చినీ ఒకే సారి ప్రకటించుకుంటున్న వాళ్ళు సోషల్ మేడియాలో రోజు రోజుకీ పెరిగిపోతున్నారు. ఇప్పుడు అదే క్రేజీ(తెలుగులో వెర్రి అనాలేమో) ఇంటర్నెట్ ని దాటి బయటికీ పాకింది. మానిటర్ మీదే గుడి కడితే సరిపోతుందా అనుకున్నట్టున్నారు. కొందరు భక్తులు బయట కూడా తమ ఫేస్ బుక్ అభిమానాన్ని గణేష్ మంటపం వేయటంలో చూపించారు. సరిగ్గా ఫేస్ బుక్ వాల్ లాగా కనిపించేలా డిజైన్ చేసిన ఫ్లెక్సీలతో మంటపాన్ని కట్టారు. కవర్ ఫొటో ప్రొఫైల్ ఫొటోలుగా వివిధ గణేశ్ రూపాలని వాడుకున్నారు ఇంకా మిగిలిన స్నేహితుల జాబితాలో (ఫ్రెండ్స్ లిస్ట్) ఇతర దేవతల ఫొటోలనీ వాడుకున్నారు. ఎక్కడా అనేది తెలియక పోయినా. ఆ మంటపం నిర్మించిన వారిని మెచ్చుకోకుండా ఉండలేం. ఇప్పుడీ ఫొటో ఫేస్ బుక్ లోనే పాపులర్ అయిపోయింది…..