Home / Entertainment / ఆస్కార్ బరిలో ఆటో డ్రైవర్ రాసిన కథ.

ఆస్కార్ బరిలో ఆటో డ్రైవర్ రాసిన కథ.

Author:

ప్రతి సంవత్సరం ఆస్కార్ అవార్డు కోసం నిర్వహించే ఫారిన్ ఫిలిం కేటగిరిలో మన దేశం తరుపున ఒక సినిమాని పంపుతారు. ఈ సంవత్సరం ఆస్కార్ అవార్డు కోసం మన దేశం నుండి పంపే సినిమా పేరుని భారత చలన చిత్ర సమాఖ్య ప్రకటించింది. ఈ సంవత్సరం మన దేశం తరుపున ఒక ఆటో డ్రైవర్ తన స్వీయ అనుభవాలతో రాసిన లాక్ అప్’ అనే నవల ఆధారంగా తీసిన సినిమా ‘విశారణై’ ని ఎంపిక చేయడం విశేషం.

visaranai

ఈ సినిమాకు వెట్రిమారన్ దర్శకత్వం వహించాడు. అలాగే ప్రముఖ నటుడు ధనుష్ ఈ సినిమాను నిర్మించడం చెప్పుకోదగ్గ అంశం. ఈ చిత్రంలో పోలీసులు మామూలు ప్రజలను ఏవిధంగా ఇబ్బంది పెడుతారో అలాగే వారి ఆకృత్యాలు, లంచగొండితనం వంటి ముఖ్యమైన అంశాలను కళ్లకు కట్టినట్టు చూపించారు. ఈ సినిమా ఈ సంవత్సరం ఫిబ్రవరిలోనే విడుదలై ప్రేక్షకులతోపాటు విమర్శకులను సైతం మెప్పించింది. ఈ సినిమాకు జాతీయ అవార్డు తోపాటు వెనిస్ లో జరిగిన 72 వ చిత్రోత్సవాలల్లో ప్రదర్శించబడింది.

(Visited 407 times, 1 visits today)