Home / Inspiring Stories / “షూ లేకుండా మన దేశం పరువు తీయకు” కేజ్రివాల్ కు విశాఖ ఇంజినీర్ లేఖ.

“షూ లేకుండా మన దేశం పరువు తీయకు” కేజ్రివాల్ కు విశాఖ ఇంజినీర్ లేఖ.

Author:

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్‌ విదేశీయుల ముందు భారత దేశ పరువు మంటగలుపుతున్నరంటూ ఆరోపించారు విశాఖకు చెందిన ఓ ఇంజినీర్. అంతే కాదు మనకన్నా ఉన్నతులైన విదేశీయుల ముందు కాస్త డిగ్నిటీగా ఉండాలంటూ సూచించారు. ఎందుకలా దేశం పరువు పోయేలా ప్రవర్తిస్తున్నారంటూ అతను కేజ్రీవాల్‌కు బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖతో పాటు 364 రూపాయల డిడిని కేజ్రీవాల్‌కు పంపించారు. కేజ్రివాల్ షూ కొనుక్కునేందుకు అంటూ ఆ డబ్బును పంపించారు. ఆ లేఖను, డిడిని పంపిన వారు సుమిత్ అగర్వాల్ అనే ఇంజినీర్. తాను పంపిన ఆ డబ్బులతో మంచి షూ జతను కొనుక్కోవాలని సూచించారు. అతను తన లేఖలో కేజ్రీవాల్ తీరు పైన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. భారత్ పరువు తీయవద్దని సున్నితంగా పేర్కొన్నారు. నీ వేషధారణ ద్వారా సాధారణ భారతీయుడి(కామన్ మ్యాన్)లా అని చెబుతూ వస్త్రధారణ కూడ తెలియని వారిలా ఈ దేశ పౌరుల పరువు తీయవద్దని పేర్కొన్నారు.

ఇంతకీ విషయమేమిటంటే గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఫ్రెంచ్ అధ్యక్షులు ఫ్రాంకోయిస్ హోలాండే గౌరవార్థం ఆ రోజున విందు ఇచ్చారు. దీనికి ఢిల్లి ముఖ్య మంత్రి కేజ్రీవాల్ కూడా హాజరయ్యారు. ఈ విందులో కాళ్ళకి సాక్స్ మీద చెప్పులు వేసుకున్న అసహ్యంగాను,దేశ ప్రజలను చిన్న బుచ్చేది గానూ కనిపించిందట ఈ ఇంజినీర్ గారికి.

Aravind Kejriwal

కేజ్రీవాల్ తీరును ఉద్దేశించి సదరు ఇంజినీర్ లేఖ రాశారు. అతను ఆ లేఖలో విదేశీయుల ముందు కనీసం ఎలా ఉండాలో నేర్చుకోవాలన్నారు. మీడియాలో వస్తున్న వార్తల మేరకు ఆ లేఖలో. మీరు, ఫ్రెంచ్ అధ్యక్షులు హోలాండే రాష్ట్రపతి భవన్లో విందుకు హాజరయ్యారు. అక్కడ మీరు సాండిల్స్ వేసుకున్నారు, ఇది నన్ను కలచివేసింది. అలా మీరు ఉన్నందుకు బాధపడ్డానని అందులో పేర్కొన్నారు. ఆ లేఖతో బాటుగా షూ కొనుక్కునేందుకు గానూ డబ్బులు పంపుతున్నట్టు డిడిని జత చేసి పంపారు. ఈ లేఖ ఇప్పుడు ఫేస్ బుక్ లో విపరీతంగా షేర్ అవుతూ. సదరు ఇంజినీర్ గారి పై విమర్శలకు కారణమౌతోంది.

Aravind

మన దేశం లో జరిగే అవినీతినీ,డబ్బు దుబారా నూ వెలికి తీసి నిజాయితీగా ఉన్న ఒకే ఒక రాజకీయ నాయకుడు షూ వేసుకోక పోతేనే మన దేశం పరువు పోయేటట్టయితే మరి వేల కొట్ల కుంభకోణాలతో,మత సంస్థలకు అనుకూలంగా పని చేసే నాయకుల వల్ల నిలబడుతుందా…? అంటూ మండి పడుతున్నారు నెటిజన్ లు.

(Visited 2,114 times, 1 visits today)