Home / Political / విలీనమవుతున్న వొడాఫోన్, ఐడియా.

విలీనమవుతున్న వొడాఫోన్, ఐడియా.

Author:

వస్తూ , వస్తూనే మొబైల్ నెట్ వర్కుల రంగంలో జియో ఎన్ని సంచలనాలు సృష్టించిందో అందరికి తెలిసిందే అనితరసాధ్యమైన విధంగా, మొదలుపెట్టిన 170 రోజులలోనే తమ ఉచిత ఆఫర్లతో 10 కోట్ల మంది సబ్ స్క్రైబర్స్ ని సొంతం చేసుకుంది జియో. జియో మార్కెట్ లోకి అడుగుపెట్టినప్పటినుండి ఇతర మొబైల్ కంపెనీల అదాయం ఘోరంగా తగ్గిపోయింది అసలు చాల మంది రీచార్జీ అనే మాట విని చాలా రోజులు అవుతుంది. జియో ఆఫర్ల పర్వం ముగుస్తున్న వేళ దానిని ధీటుగా ఎదురుకోవడానికి ఐడియా, వోడాఫోన్ కంపెనీలు కలిసి పని చేయాలని డిసైడ్ అయ్యాయి. ఈ రెండు కంపనీల విలీనంతో ఏర్పడే కొత్త మొబైల్ నెట్వర్క్ భారతదేశంలోనే పెద్ద మొబైల్ నెట్వర్క్ గా మారనుంది.

vodafone idea merger

జియోను తట్టుకోవాలంటే కలిసిపోవాలని నిర్ణయించుకున్న ఈ రెండు కంపెనీల ఖాతాదారులు మొత్తం కలిపి 40 కోట్ల మంది దాక ఉన్నారు అంటే ప్రతి ముగ్గురిలో ఒకరు ఈ నెట్ వర్క్ నే వాడుతున్నరని అర్ధం, అంతే కాకుండా రెండు కంపేనీలు కలిస్తే మొత్తం రెవెన్యూ 89వేల కోట్లకు చేరుతుంది. ఇవన్ని కలిసిరావడంతో వొడాఫోన్, ఐడియా కంపెనీల విలీనానికి మార్గం సుగమం అయ్యింది. ఇక మార్చి 31 తరువాత జియో ఫ్రీ ఆఫర్లు ముగుస్తుండడంతో తమ సబ్ స్క్రైబర్స్ జియోకి మారకుండ అన్ని కంపెనీలు వివిద ఆఫర్లు ప్రకటిస్తునాయి.

(Visited 409 times, 1 visits today)