Home / Latest Alajadi / 2014లో ఎంత శాతం మంది ఓట్లు వేసారో తెలుసా.? ఇప్పుడు మారిన లెక్కల వల్ల గెలుపు తారుమారవుతుందా.?

2014లో ఎంత శాతం మంది ఓట్లు వేసారో తెలుసా.? ఇప్పుడు మారిన లెక్కల వల్ల గెలుపు తారుమారవుతుందా.?

Author:

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 70 శాతం పోలింగ్ నమోదు అయినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. సెలబ్రిటీస్ కూడా సాధారణ ప్రజల లాగ లైన్ లో నించొని వోట్ హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రంలో 68.5 శాతం కంటే ఎక్కువగా పోలింగ్ నమోదైతే కూటమికి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇంతకుముందే లగడపాటి వెల్లడించారు. 2014 ఎన్నికల కంటే తక్కువ పోలింగ్ నమోదయితే హంగ్ ఫలితాలు వస్తాయని వెల్లడించారు. స్వతంత్రులు అధిక సంఖ్యలో గెలుస్తారనీ, బీజేపీ సీట్ల సంఖ్య కూడా పెరుగుతుందని చెప్పారు.

2014లో 68.4 శాతం పోలింగ్ జరగగా… ఈసారి కాస్త ఎక్కువగా 69.1 శాతం ఓట్లే పోలయ్యాయి. నిజానికి ఈసారి భారీ పోలింగ్ జరుగుతుందని అందరూ అంచనా వేశారు. వాస్తవ లెక్కలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి.హైదరాబాద్ లాంటి చోట్ల 80 శాతం పోలింగ్ జరగాలని టార్గెట్ పెట్టుకొని, ఆ దిశగా పనిచేశారు ఎన్నికల అధికారులు. ఐతే, ఎంత చేసినా ఫలితం నిరాశ పరిచింది.

పోలింగ్ తర్వాత రిలీజైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో అధికార టీఆర్‌ఎస్, ప్రతిపక్ష ప్రజాకూటమి రెండూ గెలుపు తమదేనన్న ధీమాతో ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇదివరకటి కంటే ఓటింగ్ శాతం పెరగడం తమకు అనుకూలమని టీఆర్‌ఎస్ చెబుతుంటే, అధికారపార్టీపై వ్యతిరేకత వల్లే అక్కడ ఓటింగ్ పెరిగిందనీ, అది తమ విజయానికి సంకేతమని కాంగ్రెస్ నేతలంటున్నారు.

(Visited 1 times, 9 visits today)