Home / Videos / పింక్ నా రాష్ట్ర రంగు.. నేను తెలంగాణాకు మద్దతు తెలుపుతున్నా-VVS.లక్ష్మణ్

పింక్ నా రాష్ట్ర రంగు.. నేను తెలంగాణాకు మద్దతు తెలుపుతున్నా-VVS.లక్ష్మణ్

Author:

వీవీఎస్ లక్ష్మణ్ అంతర్జాతీయ క్రికెట్ లో హైదరబాదీల హవా ని కొనసాగించిన ఆటగాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత ఆ హైదరాబాదీ ఇప్పుడు వ్యాఖ్యతగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అంతేగాక, పిచ్ రిపోర్ట్ ఇచ్చేందుకు కూడా వస్తున్నాడు. అయితే ఇటీవల టీవీ షోల కోసం లక్ష్మణ్ భిన్నమైన షర్ట్స్ వేసుకొస్తున్నాడు. అప్పట్లో పిచ్చుకలతో కూడిన చిత్రాలు కలిగిన షర్ట్ వేసుకొచ్చి చర్చకు దారితీశాడు.

తాజాగా, ఇటీవల ఆసియాకప్‌లో వేసుకున్న ఆయన షర్ట్ కూడా ఒక చర్చకు దారితీసింది. ఆయన వేసుకున్న పింక్ కలర్ షర్ట్ మీద గ్లోరియస్ పింక్‌ అంటూ కామెంట్ చేయబోయిన ప్రముఖ వ్యాక్యాత హర్షా బోంగ్లే ని అడ్డుకుంటూనే “పింక్ నా రాష్ట్రమైన తెలంగాణా రంగు నేను నా తెలంగాణా ను సపోర్ట్ చేస్తున్నా” అంటూ చెప్పాడు.
వెంటనే అక్కడే నిలబడి ఉన్న హెడెన్ ని చూపిస్తూ క్వీన్స్‌లాండ్ డ్రెస్సు వేసుకున్నాడని భోగ్లే ఛమత్కరించాడు. కాగా, తాను వేసుకుంది బీచ్ డ్రెస్ అంటూ హెడెన్ ఆ సెటైర్‌కు సమాధానం ఇచ్చుకున్నాడు.
ఆ తర్వాత, తన షర్ట్‌పై నీ అభిప్రాయమేంటని భారత స్పిన్నర్‌ హర్భజన్ సింగ్‌ను లక్ష్మణ్ ప్రశ్నించాడు. ‘మీరు అద్భుతంగా కనిపిస్తున్నారు. నవజోత్ సిద్ధు కూడా వ్యాఖ్యాతగా ఇలాంటి షర్ట్స్‌తో ఆకట్టుకునేవారు’ అని భజ్జీ వ్యాఖ్యానించాడు. అంతే కాదు బజ్జీ కూడా హెడెన్ ని వదల్లేదు.. “ఇప్పుడే గోవా నుంచి వచ్చినట్టు కనిపిస్తున్నావ్ అంటూ సెటైర్ వేసాడు. అయితే, మొత్తానికి లక్ష్మణ్ షర్ట్ ఇప్పుడు యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తోంది.

(Visited 1,177 times, 1 visits today)