Home / Inspiring Stories / పేదల ఆకలిని తీర్చడానికి ఈ యువ కలెక్టర్ చేస్తున్న పని గురించి తెలుసుకోండి.

పేదల ఆకలిని తీర్చడానికి ఈ యువ కలెక్టర్ చేస్తున్న పని గురించి తెలుసుకోండి.

Author:

పాత 500, 1000 రూపాయల నోట్ల రద్దుతో మద్యతరగతి కుటుంబాలకే రోజు గడవని పరిస్థితి, ఇక పేదలు, రోజువారి కూలీలు మూడు పూటలకు తిండి కోసం సరిపడ ఆదాయం లేక తీవ్ర బాధలు పడుతున్నారు. అలా ఆకలితో అలమటించే యాచకుల, కూలీల మరియు కడు పేదవారి ఆకలి తీర్చడం కోసం “అన్నం పరబ్రహ్మ సహాకార ఆహరం” అనే పథకానికి రూపకల్పన చేశారు వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి.

collector-amrapali

గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధ్వర్యంలో చేపట్టబోతున్న ఈ పథకంలో భాగంగా నగరంలోని అన్ని హోటల్స్ లలో, ఫంక్షన్ హాళ్లలో మరియు ఇతర ఈవెంట్లలో మిగిలిపోతున్న ఆహారాన్ని శుభ్రంగా సేకరించి.. ఆకలితో పస్తులుంటున్న ఎంతో మంది అభాగ్యుల ఆకలిని తీర్చనున్నారు. ఈ పథకం కోసం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 9 ప్రాంతాలను ఎంపిక చేసి ఆహారాన్ని సేకరిస్తారు . అలా సేకరించిన ఆహారాన్ని భద్రపరిచేందుకు భారీ మొత్తంలో రిఫ్రిజిరేటర్లను పలు కార్పొరేట్ సంస్థలు అందించటానికి ముందుకు వచ్చాయి. సేకరించిన ఆహార నాణ్యతను పుడ్ ఇనస్పెక్టర్లు, కార్పొరేషన్ ఆరోగ్య అధికారులు పర్యవేక్షిస్తారు. సేకరించిన ఆహారాన్ని ఫ్యాకెట్లలోకి మార్చి వాటిపై సేకరించిన డేట్ వేస్తారు. ఈ ఆహారాన్ని రిఫ్రిజిరేటర్లు లలో భద్రపరిచి అవసరం ఉన్న వారికి పంచుతారు.

ఈ అద్భుతమైన “అన్నం పరబ్రహ్మ సహాకార ఆహరం” కార్యక్రమం ఈ నెల 26 లాంఛనంగా ప్రారంభం కానుంది. ఎంజిఎం సెంటర్, హన్మకొండ, వరంగల్, కాజీపేట రైల్వేస్టేషన్, హన్మకొండ కలెక్టరేట్, పాలమూరు గ్రిల్ సెంటర్, పోచమ్మ మైదానంతో పాటు మరో రెండు సెంటర్లలో ఆహార సేకరణ మరియు పంపిణి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ పథకానికి లభించే ఆదరణను బట్టి రానున్న రోజుల్లో మార్పులు చేయనున్నారు. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బంది పడకుండా వరంగల్  లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. యాచకులు, కూలీలు, పేదలు, నిస్సహాయులు ఎవరైనా వినియోగించుకోవచ్చు. పేదల ఆకలి తీర్చే ప్రయత్నం ఇది అందుకే అందరి సహకారం కావాలి అని కలెక్టర్ అమ్రపాలి కోరారు.

(Visited 7,328 times, 1 visits today)