Home / Inspiring Stories / ఆడ్ చూడండి మనీ పొందండి.

ఆడ్ చూడండి మనీ పొందండి.

Author:

Adstore App

రోజు రోజుకీ ప్రచార రంగం మరింత పదునైన ఆలో చనలతో దూసుకు పోతోంది. పెట్టు బడిగా వాడాల్సింది మీ బుర్ర మాత్రమే. మీ ఆలోచనలకు పదును పెట్టాలే గానీ సంపాదన దానంతట అదే వచ్చి పడుతుంది. నిదర్శణంగా ఆన్లైన్లో మనం రోజూ చూస్తున్న “యాప్” లే చాలు. యాడ్ స్టోర్ కొత్తగా వచ్చినా స్పీద్ గానే ఉంది. అసలు విసయం ఏమిటంటే .ఇతర విధానాలతో పోల్చితే.. కస్టమర్లకు సంబంధించిన వివరాలను మొబైల్స్ మరింత ఎక్కువగా సేకరిస్తాయి. వారి అలవాట్లు, ప్రాధాన్యతలు, బ్రాండ్లకు సంబంధించిన డేటాను ఎక్కువగా పసిగడతాయి స్మార్ట్‌ఫోన్స్. దీంతో అడ్వర్‌టెయింజింగ్ మరింత శక్తివంతంగా, వ్యూహాత్మకంగా అడుగులు వేసేందుకు అవకాశం లభిస్తుంది. బ్రాండ్స్ ఇచ్చే యాడ్స్‌కు సంబంధించి యాడ్‌స్టోర్ ఒక మార్కెట్ ప్లేస్ లాంటిది. అంతే కాదు. ఆయా ప్రకటనలను చూడడం ద్వారా.కస్టమర్లకు ప్రతిఫలం కూడా దక్కుతుంది. అంటున్నారు హై స్కూల్ నుంచి స్నేహితులైన నరేన్ భుద్వాని(సీఈఓ), పియూష్ ఢకన్(సీఓఓ)లు యాడ్‌స్టోర్‌ను ప్రారంభించారు. వీరిద్దరూ దుబాయ్‌లోనే పుట్టి పెరిగిన వ్యక్తులు.

అర్థం కాలేదా…? యాడ్‌స్టోర్ ద్వారా మూవీ ట్రైలర్స్, యూట్యూబ్ ఛానల్ ప్రమోషన్స్, వెబ్ ఆధారిత వీడియో యాడ్స్‌ను సెర్చ్ చేసి  చూడచ్చు. ఇందులో ఉండే అడ్వర్టైజ్ మెంట్ వీడియోలు శాఋట్ ఫిలింస్ లా తీయబడి ఎంటర్టైన్ చేసే విధంగా 2నుంచి 3 నిమిషాల నిడివితో ఉంటాయి. మనం ఈ వీదియో చూసాక.వాళ్ళు అడిగే ఒక చిన్న ఓ పోల్‌లో పాల్గొనడం కానీ. (మీరు దీనిని సమర్థ్స్ర్తారా… ఈ ప్రొడక్ట్ మీకు ఎలా ఉందీ లాంటి ఒకటీ రెండు ప్రశ్ణలు) లేదా మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్‌కు ఆన్సర్స్ ఇవ్వడం కానీ చేయాలి. ఈ ప్రాసెస్‌నే తమ యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్‌గా చెబుతోంది యాడ్‌స్టోర్. ఈ ప్రశ్నలు, జవాబులను విశ్లేషించి ఆయా ప్రోడక్త్ పై మార్కెట్ లో ఉన్న టాక్ ఏమిటో కంపెనీలకు అందిస్తుంది యాడ్‌స్టోర్. నేరుగా యూజర్ల నుంచి వచ్చే సమాచారం కావటం తో కంపెనీలకు ఇది చాలా విలువైన సమాచారంగా పరిగణించవచ్చు. మార్కెటింగ్ వ్యూహాలు,కొత్త ప్రోడక్ట్ లాంచ్ లూ,ఇప్పటికే ఉన్న ప్రోడక్ట్ లలో చేయాల్సిన మార్పులూ విషయంలో బ్రాండ్ కంపెనీలకు ఈ డేటా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

దీనికి ప్రతిఫలంగానే మీకు ఫ్లిప్‌కార్ట్, ఫ్రీఛార్జ్, మెక్‌డొనాల్డ్స్ వంటి కంపెనీల నుంచి వోచర్లు అందుతాయి. ప్రస్తుతం యాడ్‌స్టోర్‌ని ఉపయోగిస్తున్న వారిలో. 16-25 ఏజ్ గ్రూప్‌లోని వ్యక్తులే ఎక్కువగా ఉంటున్నారు. వీరితోపాటు విభిన్నమైన ఏజ్‌ గ్రూప్‌లను ఆకర్షించే ప్రణాళికలను సిద్ధం చేసుకుంటోందీ స్టార్టప్. ప్రస్తుతం ఐఓఎస్ యాప్ రూపకల్పన జరుగతుండగా.. త్వరలో దీన్ని లాంఛ్ చేయబోతున్నారు కూడా. “వీడియో అడ్వర్‌టైజింగ్ విషయంలో యాడ్‌స్టోర్ ఓ వినూత్నమైన ప్లాట్‌ఫాం. చిన్న చిన్న యాడ్స్‌కు విపరీతంగా ఆదరణ పెరుగుతోంది. టీవీల్లోనూ, యూట్యూబ్‌లోనూ కూడా చిన్న ప్రమోషనల్ వీడియోలు ఇప్పుడు సాధారణం అయిపోయాయి. అలాంటి సమయంలో కేవలం యాడ్స్‌కే పరిమితయ్యేలా ప్లాట్‌ఫాం డిజైన్ చేయాలనే ఆలోచన విభిన్నమైనదే. ఈ యాడ్స్‌కు కొన్ని స్టోరీలైన్స్ జత చేస్తుండడంతో.. యూజర్లు యాప్‌కి అతుక్కుపోయే అవకాశం ఎక్కువగానే ఉంది. మరింతమంది యూజర్లు, అడ్వర్‌టెయిజర్లను ఈ ప్లాట్‌ఫాంపైకి తీసుకురాగలిగితే.. ఈ వెంచర్ విజయం సాధించే అవకాశం ఎక్కువగానే ఉంది.”

(Visited 227 times, 1 visits today)