Home / Inspiring Stories / వాచ్ మెన్ పోస్టుకూ ఎగబడుతున్న పట్టబధ్రులు.

వాచ్ మెన్ పోస్టుకూ ఎగబడుతున్న పట్టబధ్రులు.

Author:

రఘురాం M.Tech, సతీష్ కుమార్ MBA ,రవీంద్ర B.Tech  ఇవేం సినిమా పేర్లు కావు పోయిన శుక్ర వారం విశాఖ జిల్లా విద్యుత్ బోర్డులో వాచ్ మెన్ ఉధ్యోగాలకి దరఖాస్తు చేసుకున్న అభ్యర్తుల పేర్లు.   ఒక్కొక్కరూ అత్యున్నత యూనివర్సిటీలలో తమ్న విధ్యని పూర్తి చేసుకుని ఉధ్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు కానీ ఆ ఉద్యోగానికి కావలైసిన అర్హత కేవలం పదో తరగతి పాస్ లేదా ఫెయిల్. కానీ ఉద్యోగాల కొరత,ఆకలి మంటా,ప్రభుత్వోద్యగమే సెక్యూర్టీ అన్న అపోహ ఆ పట్టబధ్రులని రోడ్లపై పరుగులు తీయించింది.. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్టణం జిల్లా విద్యుత్ శాఖలో రెండు నైట్ వాచ్ మన్ పోస్టులకుగానూ పోయిన శుక్రవారం నిర్వహించిన పరుగు పందెంలో బీటెక్ లు, ఎమ్బీఏ లు, ఇతర డిగ్రీలు చేసిన వందలాది మంది అభ్యర్థులు కూడా పాల్గొని తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. విశాఖ జిల్లా విద్యుత్ శాఖ డిపార్టుమెంట్ విభాగంలో ఒక పోస్టు, ఏపీఈపీడీసీఎల్ జిల్లా హెడ్ ఆఫీస్‌లో మరో పోస్టు ఖాళీగా ఉన్నాయి. ఈ రెండు పోస్టులకు 462 మంది అభ్యర్థులు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్నారు.. విశాఖ TOI, EPDCL సర్కిల్ ఇంజినీరింగ్ సూపెరింటెండెంట్ M.సత్యనారాయణ మూర్తి గారే వచ్చిన దరకాస్తులు చూసి అవాక్కయ్యారట.

2.5 కిలోమీటర్ల దూరాన్ని 13 నిమిషాల్లో అధిగమించటం కోసం రోడ్లపై ఆకలితో పరుగులెత్తారు… సాటి పట్ట బద్రులనీ ఆ కొద్ది సేపటికీ తమ శతృవులు అన్నంత కోపంగా తమ అవకాశాన్ని ఎత్తుకు పోయే దొంగలు గా చూసుకున్నారు..విద్యుత్ శాఖ డిపార్టుమెంట్ విభాగంలో ఉద్యోగం కోసం ముడసర్లోవ వద్ద బీఆర్‌టీఎస్ రోడ్డులో శుక్రవారం ఉదయం ఆ శాఖ అధికారులు అభ్యర్థులకు పరుగు పోటీలు నిర్వహించారు.లక్షలు ఖర్చు చేసి ఇంజినీరింగ్ చేసిన అభ్యర్తులు కూడా రోడ్డు పై ఒక్క ఉద్యోగం కోసం, అదీ తమ నాలుగేళ్ళ చదువుకి ఏ మాత్రం సరి తూగని ఉద్యొగం కోసం ఎండలో పరుగులెతారు.భారత దేశ నిరుధ్యోగ పరిస్తితి ఇలా ఉంటే కేవలం శంకుస్థాపనల కోసం వందలకోటూ, ఆటల కోసం వందల కోట్లూ ఖర్చు చేస్తున్న ప్రభుత్వాలని. అక్కడే ఉన్న విశాఖ విధ్యార్తి ఒకరు తిట్టిపోయటం చాలా మందినే కదిలించింది…

(Visited 195 times, 1 visits today)